యువ

ఫేస్‌బుక్‌లో మరో ఫీచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన యూజర్ల కోసం ‘ఫేస్‌బుక్’ మరో శుభవార్తను మోసుకొచ్చింది. ఓ పవర్‌ఫుల్ ఫీచర్‌ను అతి త్వరలోనే వినియోగదారులకు అందించనుంది. ‘వాచ్’ పేరిట ఓ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో వున్న ఫేస్‌బుక్ యూజర్లకు లభిస్తున్నది. త్వరలోనే భారత్‌లో దీన్ని లాంఛ్ చేయనున్నారు. దేశంలో ఈ ఏడాది జూలై వరకు ఫేస్‌బుక్ లెక్కల ప్రకారం ఆ సంస్థ సేవల్ని వాడుతున్న యూజర్లు 24.1 కోట్లవరకు వున్నట్టు అంచనా. ఈ క్రమంలోనే అంత భారీ మార్కెట్ వున్నందునే ఫేస్‌బుక్ వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రవేశపెడుతున్నది.యూజర్లకు బాగా నచ్చే అంశాలు కలిగిన వీడియో షోలను స్ట్రీమింగ్ సేవల్లో ఫేస్‌బుక్ అందివ్వనుంది. లైఫ్ స్టైల్, కామెడీ, చిల్డ్రన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి జానర్‌లకు సంబంధించిన వీడియోలను స్ట్రీమింగ్ సేవ ద్వారా అందించాలనే యోచనలో ఫేస్‌బుక్ వుంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఫేస్‌బుక్ వెల్లడించలేదు. కానీ అతిత్వరలోనే అందుబాటులోకి రావచ్చని తెలిసింది.