యువ

అన్నం పారేయకండి.. ప్లీజ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తగినంత తిండి లేక.. ఆకలితో అలమటిస్తూ నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే- ఈ కఠోర వాస్తవాన్ని చాలామంది అంగీకరించరు.. ఇలాంటి వారిలో అవగాహన కలిగిస్తే- వారు ఆహార పదార్థాలను వృథా
చేయకుండా జాగ్రత్త పడడమే కాదు.. అన్నార్తులకు ఎంతోకొంత సాయం చేస్తుంటారు..’

నీటి వృథాను అరికట్టాలని, భూమికోతను నివారించాలని గతంలో ఇతను 3,200
కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేశాడు. అయితే, అందుకు భిన్నంగా ఈసారి పాదయాత్ర చేయాలని సంకల్పించి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు.

ఎంటెక్ చదివిన ఇరవై నాలుగేళ్ల కుర్రాడు ఈ మాటలు చెబుతుంటే- ఏదో ఊసుపోక చెబుతున్నది కాదని మనం భావించాలి. అధిక జనాభాకు నిలయమైన మన దేశంలోనే కాదు, విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహారోత్పత్తులకు తీవ్రమైన కొరత కనిపిస్తుండగా- మరోవైపు ఆహార పదార్థాలను యథేచ్ఛగా వృథా చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని అందరం అంగీకరిస్తాం. కానీ- విందులు, వినోదాల సందర్భంగా విచ్చలవిడిగా ఆహార పదార్థాలను చెత్తలో పారవేస్తాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటూ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కన్యాకుమారి (తమిళనాడు)కి చెందిన నిగిన్ బినేష్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు. ‘్భజన పదార్థాలను పారవేయకండి’ అంటూ అందరినీ వేడుకుంటున్నాడు.
కోయంబత్తూరులో ఎంటెక్ చదువుతుండగా నిగిన్ ఓసారి అక్కడి ప్రముఖ హోటల్‌కు భోజనం కోసం వెళ్లాడు. హోటల్ వెనుకభాగంలో గుట్టలకొద్దీ ఆహార పదార్థాలను పారవేయడాన్ని చూసి అతను చలించిపోయాడు. హోటల్‌లో భోజనం చేసినవారు వదిలేసిన ఆహార పదార్థాలను అక్కడ పారవేయగా, మరోవైపు చెత్తకుప్పలోనుంచి ఆహారాన్ని ఏరుకుంటున్న ఓ బిచ్చగత్తెను చూశాడు. విందులో పాల్గొన్న వారికి ఆహార పదార్థాలు వృథాగా కనిపించగా, ఆ పేద మహిళకు అన్నం దొరకడమే కష్టంగా మారడం చూసి అతనిలో ఆవేదన రగిలింది. ఒక్క హోటల్‌లోనే ఇంతగా ఆహార పదార్థాలను పారవేస్తుంటే దేశ వ్యాప్తంగా ఎంతగా వృథా చేస్తున్నారో ఊహించి నిగిన్ కలత చెందాడు. భారత్‌లో తగిన ఆహారం లేక ఆకలి బాధతలో ప్రతిరోజూ దాదాపు ఏడువేల మంది మృత్యువాత పడుతున్నారని తెలుసుకున్నాడు. ఆకలి వల్ల అనేక రోగాల పాలై మరణిస్తున్నవారి వివరాలు అతనిలో ఆవేదన కలిగించాయి. దీంతో ఆహారాన్ని వృథా చేయరాదన్న విషయమై అవగాహన కలిగించేందుకు గత ఆగస్టు 24న అతను దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఇంతవరకూ సుమారు 1,800 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలి వంటి ప్రాంతాల్లో పాదయాత్ర చేశాడు.
ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ పాదయాత్ర చేస్తానని నిగిన్ చెబుతున్నాడు. తగిన ఆహారం లభించక ఎంతోమంది మరణిస్తున్నారన్న విషయం తెలియక చాలామంది భోజన పదార్థాలను వృథా చేస్తున్నారని నిగిన్ తెలిపాడు. ఈ విషయాన్ని గ్రహించినవారు వృథాను అరికట్టి, ఆహార పదార్థాలను అవసరమైన వారికి దానం చేయడం ప్రారంభిస్తున్నారని చెబుతున్నాడు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఈ విషయాలను పాదయాత్ర సందర్భంగా ఇతను వివరిస్తున్నాడు. కాగా, నీటి వృథాను అరికట్టాలని, భూమికోతను నివారించాలని గతంలో ఇతను 3,200 కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేశాడు. అయితే, అందుకు భిన్నంగా ఈసారి పాదయాత్ర చేయాలని సంకల్పించి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. ఆంగ్లం, తమిళం, మళయాలం భాషలు తెలిసిన ఇతనికి ఇపుడు పాదయాత్ర సందర్భంగా హిందీపైన ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాంతీయ భాషల్లో వచ్చే వార్తాకథనాలు తనను ఎంతగానో కదిలించాయని చెబుతున్నాడు. పాదయాత్ర సందర్భంగా తాను నగదును తీసుకువెళ్లడం లేదని, అన్ని ప్రాంతాల్లో మానవతావాదంతో స్థానికులే తనకు సహకరిస్తున్నారని తెలిపాడు. పాదయాత్ర సందర్భంగా రాత్రివేళ పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, సముద్ర తీరాన నిద్రిస్తున్నానని చెప్పాడు. రత్నగిరి అటవీ ప్రాంతంలో వెళ్తుండగా ఆహారం లేక నీరసించిపోగా ఆ దారిన పోయే ట్రక్కు డ్రైవర్లు తనను ఆదుకున్నారని గుర్తు చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, తన పాదయాత్ర వల్ల కొంతమందిలో చైతన్యం రావడం సంతోషం కలిగిస్తోందని నిగిన్ అంటున్నాడు. ఆహార పదార్థాల కొరత వల్ల ఎదురయ్యే విపరిణామాల గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలన్నదే తన తపన అని చెబుతున్నాడు.