యువ

స్మార్ట్‌గా ‘ఆధార్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీలో సీటు.. స్కాలర్‌షిప్.. హాస్టల్‌లో అడ్మిషన్.. పోటీ పరీక్షలు.. బ్యాంకు లావాదేవీలు.. ప్రయాణాలు.. ఇలా ఏ సౌకర్యం పొందాలన్నా, ఎలాంటి బిల్లులు చెల్లించాలన్నా నేడు ‘ఆధార్ కార్డు’ను ఎవరైనా తమవెంట ఉంచుకోవడం అనివార్యం. ‘ఆధార్’ లేకుంటే ఏ పనులూ జరగని పరిస్థితి ఇపుడు నెలకొంది. హడావుడిలో దీన్ని మరచిపోతే ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి ఇబ్బందుల నుంచి మనల్ని గట్టెక్కించేందుకే ‘మొబైల్ ఆధార్ యాప్’ దోహదపడుతుంది. స్మార్ట్ఫోన్‌లో ఈ యాప్‌ను ‘డౌన్‌లోడ్’ చేసుకుని, అవసరమైనపుడు మన ఫోన్‌లోనే ‘ఆధార్ కార్డు’ను చూపించవచ్చు. ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు అవసరం వచ్చినపుడు వెంటనే ‘ఆధార్ కార్డు’ను చూపిస్తే ఎలాంటి అసౌకర్యం నుంచైనా బయటపడవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ‘ఆధార్’ యాప్‌ను తమ స్మార్ట్ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఆధార్ కార్డు చూపాల్సిన అవసరం ఏర్పడితే క్యూఆర్ కోడ్, పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ‘ఈ-కేవైసీ’ (ఎలక్ట్రానిక్- నో యువర్ కస్టమర్) డేటాను చూపించవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 ప్లాట్‌ఫామ్ సహా ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన అన్ని వెర్షన్‌లలో ఆధార్ యాప్ పనిచేస్తుంది. ఒకరికి సంబంధించిన ఆధార్ ప్రొఫైల్ ఒక్క ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరో ఫోన్‌లో కొత్తగా ఆధార్ ప్రొఫైల్‌ను పెట్టుకుంటే పాత ఫోన్‌లోని డేటా పనికిరాకుండా (ఇనాక్టివ్) పోతుంది. ఒక కుటుంబంలోని మొత్తం సభ్యులకు చెందిన ఆధార్ నెంబర్లను ఒకే ఫోన్ నెంబర్‌తో అనుసంధానించినా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. యాప్‌లో ఒకేసారి ముగ్గురి ప్రొఫైల్స్ నమోదు చేసే అవకాశం ఉంది. రైలు ప్రయాణాల్లో, వేరే ఊరికి వెళ్లినపుడు లాడ్జీలలో దిగినపుడు మొబైల్ ఆధార్‌ను నేడు ఒక ‘ఐడెంటిటీ’గా అంగీకరిస్తున్నారు. యాప్‌ను వినియోగించి ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని మరొకరు చూడకుండా లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసినవారు తప్ప ఇతరులు ‘అన్‌లాక్’ చేసి మన ఆధార్ డేటాను చూసే వీలు ఉండదు.
స్మార్ట్ఫోన్‌లో ‘ఆధార్’ యాప్‌ను వినియోగించాలనుకుంటే ముందుగా మన మొబైల్ నెంబర్‌ను ‘ఆధార్’తో అనుసంధానం చేసుకోవాలి. ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి ఆధార్ యాప్‌ను మన స్మార్ట్ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ కలిగిన ‘సిమ్’ను వాడినపుడే ఈ యాప్ పనిచేస్తుంది. ‘వన్‌టైమ్ పాస్‌వర్డ్’ (ఓటీపీ) అవసరం లేకుండానే ‘టైమ్ బేస్డ్ వన్‌టైమ్ పాస్‌వర్డ్’ (టిఓటీపీ)తో ‘ఆధార్’ యాప్ పనిచేస్తుంది. ఓటీపీని మనం నమోదు చేయకుండానే దాన్ని ఈ యాప్ దానంతట అదే రీడ్ చేస్తుంది. అందుకే.. ‘స్మార్ట్ ఆధార్’ మన వెంట ఉంటే ఏ చింతా లేనట్టే.