యువ

షియోమి నుంచి దేశ్‌కా స్మార్ట్ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలో మొబైల్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న షియోమి కంపెనీ రెడ్‌మి సిరీస్‌లో సరికొత్త స్మార్ట్ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్ అయిన తరువాత డిసెంబర్ మొదటివారం నుంచి ఈ ఫోన్ అమ్మకాలకు వెళుతుందని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని షియొమి కంపెనీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. షియోమి కంపెనీ నవంబర్ 30న విడుదల చేసిన ఫోన్‌ను ‘దేశ్‌కా స్మార్ట్ఫోన్’ అంటూ షియోమి సంస్థ అభివర్ణించింది. షియోమి నుంచి వచ్చిన అన్ని ఫోన్‌లకంటే ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిందని సమాచారం.
రెడ్‌మీ 5ఏ
రెడ్‌మీ 5ఏ రకం కూడా దేశ్‌కా స్మార్ట్ఫోన్‌గా రాబోతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర కూడా సుమారుగా 5,800గా ఉండవచ్చని అంచనా. ఇప్పటివరకూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న షియోమి ఉత్పత్తుల్లో అత్యంత తక్కువ ధరకు లభించే ఫోన్ రెడ్‌మీ 4ఎ అన్న విషయం తెలిసిందే.
రెడ్‌మీ 5ఎ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే, 1280న720పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజి, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జి వివోఎల్‌టిఈ, బ్లూటూత్, 4.1, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ. కాగా, ఈ ఫోన్‌తోపాటు పలు ఆఫర్లను షియోమి ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ మధ్య కార్బన్ నుంచి వచ్చిన ఎయిర్‌టెల్, ఇతర ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుందని టెక్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
వాట్సాప్‌లో మరో ఆకర్షణ..
విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులకు చేరువవుతోంది. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేసేలా సరికొత్త బెటావెర్షన్‌ను ‘వాట్సాప్’ రూపొందించింది. దీంతో వాట్సాప్‌లో వాయిస్ కాల్ మాట్లాడుతూనే వీడియోకాల్‌కు మారవచ్చు. ఇలా మారేందుకు డిస్‌కనెక్ట్ కానక్కర్లేదు. కేవలం రీడయల్ చేస్తే వెంటనే వీడియోకాల్‌కు మారిపోతారు. వీడియోను ‘మ్యూట్’ చేస్తే మరో ఫీచర్‌కు మారిపోవచ్చు. దీంతోపాటు ఐపాడ్‌ను వాడే వారికోసం సరికొత్త యాప్‌ను త్వరలోనే అందించనున్నట్లు ‘వాట్సాప్’ ప్రకటించింది.
ఒప్పో నుంచి ‘ఎఫ్-5 యూత్’
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌పోన్ ‘ఎఫ్-5 యూత్’ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను ఆ కంపెనీ రూ.17,750గా నిర్ణయించింది. అయితే, ప్రస్తుతానికి ఇది ఫిలిప్పీన్స్‌లో మాత్రమే విడుదలైంది. భారత్‌లోకి ఎప్పుడు రంగప్రవేశం చేసేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బెజెల్ లెస్ డిస్‌ప్లే ద్వారా ‘్ఫల్ వ్యూ’ అనుభూతి వినియోగదారులకు కలుగుతుందని ఒప్పో భరోసా ఇస్తోంది. ఇక ఈఫోన్‌లో డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్‌ను ఇచ్చారు. దీనివల్ల ఏకకాలంలో రెండు సిమ్‌కార్డులతోపాటు ఒక మెమొరీ కార్డును కూడా యూజర్లు వేసుకుని వాడవచ్చు. ఇందులోని విశిష్టతలు... 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే. 2160న1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగా పాక్సెల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జి ఎల్‌టిఇ, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 3200 ఎంఎహెచ్ బ్యాటరీ.
కొత్త సంవత్సరం కానుక..
చైనాలో ప్రఖ్యాతి చెందిన మొబైన్ ఉత్పత్తుల కంపెనీ హానర్ సరికొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రాంఛ్ చేయబోతోంది. అదిరిపోయే ఫీచర్స్, స్పెసిఫిక్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. వన్ ప్లస్ 5 టి తీసుకోవాల్సిన లక్ష్యంతో, హువాయి సబ్ బ్రండ్ హానర్ బెస్‌లెస్ స్మార్ట్ ఫోన్ వి 10న త్వరలోనే మార్కెట్‌లోకి రిలీజ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్ ఎ1తో ఎనాబుల్ చేసిన చిప్ సెట్‌తో వస్తోంది. హానర్ నుంచి ఇలాంటి డివైస్ రావడం ఇదే మొదటిసారి.
ఈ స్మార్ట్ఫోన్ గురిచి ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, డిసెంబర్ 5వ తేదీన లండన్‌లో జరిగే కార్యక్రమంలో హానర్ తన నూతన డివైస్ గురించి ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ డివైస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి చర్చించినట్లుయితే హానర్ వి10, 128 జిబి ఇంటర్నల్ మెమరీతోపాటు ర్యామ్ 6 జిబితో వస్తోంది. 16 మెగా పిక్సెల్, 20 మెగాపిక్స్ సెన్సార్ కలిగిన డ్యూయల్ పేసింగ్ కెమెరా సిస్టమ్ హ్యాండ్ సెట్ కలిగి ఉంటుంది. యుపి ఫ్రంట్ డివైస్ 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ షూటర్ను కలిగి వుంటుంది.
మరో బెజిల్‌లెస్ స్మార్ట్ఫోన్
చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఎ79ను అతి త్వరలో ఇండియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ధర సుమరు రూ.23వేలుగా ఉండే అవకావం ఉంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 6 ఇంచ్ భారీ డిస్‌ప్లే అని చెప్పవచ్చు. చైనా అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఈఫోన్‌కి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 1 నుంచి పోన్ల డెలివరీ ఉంటుందని కంపెనీ తెలిసింది.
బంపర్ ఆఫర్లతో వన్‌ప్లస్ 5-టి
చైనా సెల్ఫీ మొబైల్ దిగ్గజం వన్ ప్లస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వన్ ప్లస్ 5 టి స్మార్ట్ఫోన్ ఇండియాలో అమ్మకానికి వచ్చింది. అమెజాన్ ఇండియా, వన్ ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్లు ఈ ఫోన్ విక్రయాలపై పలు ఆఫర్లను ప్రకటించాయి.
అదిరే ఫీచర్లు..
6 అంగుళాల అప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, ప్రొటెక్షన్ కోసం గొర్రిల్లా గ్లాస్, 5 ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్, 835 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్సీజెన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌తో రన్నింగ్ రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20 మెగా పిక్సెల్ సెన్సర్, రెండోది 16 మెగా పిక్సెల్ మోడ్యూల్ ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత. 3,300 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ సౌకర్యాలున్నాయి.
6 జిబి ర్యామ్, 64 జిబి ఇన్‌బిల్ట్ స్టోరోజీ వేరియెంట్ ధర రూ.32,999/-, 8 జిబి ర్యామ్, 128 జిబి ఇన్‌బిల్డ్ స్టోరేజీ ధర రూ.37,999గా నిర్ణయించింది. కాగా మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియెంట్ మాత్రమే ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో వుంది.
ఈ ఫోన్ కొనుగోలు చేసిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్, ఐడియా నుంచి 100 జిబి 4జి మొబైల్ డాటా (రూ.357 రీఛార్జిపై 18 నెలలపాటు రోజుకు 2 జిబి డేటా) ఇస్తోంది. ఏడాది ఉచిత మెంబర్‌షిప్ జోమాట్ గోల్డ్‌ఏడాది ఉచిత మెంబర్‌షిప్, కిండిల్ స్టోర్‌పై రూ.500 క్రెడిట్, కొత్త అమెజాన్ ప్రైమ్ కస్టర్లకు రూ.300 అమెజాన్ పే బ్యాలెన్స్, ప్రైమ్ వీడియో యాప్ ద్వారా వీడియో స్ట్రీమ్ చేస్తే రూ.250 అమెజన్ పే బ్యాలెన్స్ అందుబాటులో ఉన్నాయి.
యాక్సిడెంటల్ డ్యామేజి
ఇన్సూరెన్స్ వన్ ఇయర్ యాక్సిడెంటల్ డ్యామేజి ఇన్సూరెన్స్ వన్ ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌పై వన్ ప్లస్ 5 టి కొనుగోలు చేసిన కస్టమర్లకు యాక్ససరీస్‌పై రూ.1000 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు కంపెనీ వన్ ఇయర్ యాక్సిడెంటల్ డ్యామేజీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందించనుంది.
ఒప్పో ఎ 79 ఫీచర్లు
6 ఇంజ్ ఓలెడ్ డిస్‌ప్లే, 2180న1080 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్, 128 జిబి విస్తరణ సామర్థ్యం, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, 4 జి వివో ఎల్‌టిఇ, ఫింగర్ ఫ్రింట్ సెన్సర్, 300ఎంఎసెచ్ బ్యాటరీ.