యువ

వారసురాలి ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘భారతరత్న’ ఎంఎస్ సుబ్బులక్ష్మి ముని మనవరాలు ఐశ్వర్య సంప్రదాయ సంగీతంలో సత్తా చాటుకుని ఇపుడు నేపథ్య గాయకురాలిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఉమాశంకర్ దర్శకత్వంలో గురుకల్యాణ్ సంగీత దర్శకుడిగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కురల్ 146’లో ఐశ్వర్య తన గాన మాధుర్యాన్ని వినిపించనున్నారు. ఆ సినిమాలో తల్లి, కుమారుడి మధ్య అనుబంధాన్ని తెలియజేసే పాటను పాడించేందుకు ఐశ్వర్యను ఎంపిక చేశారు. దైవత్వం, కారుణ్యం ఉట్టిపడేలా ఆ పాటను పాడించాలని కొత్త గళం కోసం సంగీత దర్శకుడు గురుకల్యాణ్ రెండు నెలల పాటు అనే్వషించారు. అయితే, ‘ఫేస్‌బుక్’లో ఐశ్వర్య పాడిన కొన్ని పాటలను విన్నాక ఆయన చలించిపోయారు. ఐశ్వర్య సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి ముని మనవరాలు అని తెలిశాక, ఆ పాటను ఆమెచేత పాడించాలని నిర్ణయించుకున్నారు. ముందే రికార్డు చేసిన ‘ట్రాక్’లో తాను పాడేది లేదని, సాహిత్యానికి అనుగుణంగా మాత్రమే పాడతానని ఐశ్వర్య నిర్మొహమాటంగా చెప్పారు. సినిమాల్లో పాడే అవకాశం కోసం ఆమె అర్రులు చాచలేదు. ఇప్పటికే కర్నాటక సంగీతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘కురల్ 146’లో పాట కోసం నెల రోజులపాటు సాధన చేశారు. ఆ పాటలో తల్లి పాత్ర వినిపించే పాటను ఐశ్వర్య పాడారు. రెండో భాగాన్ని సంగీత దర్శకుడు పాడారు. ఈ పాట సినిమాలో చాలా సన్నివేశాల్లో వినిపిస్తుందని, వయొలినిస్టులు చాలా శ్రమపడి సంగీతం అందించారని గురుకల్యాణ్ చెబుతున్నారు.