యువ

అయిష్టంగానే.. అనుకోని మలుపు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకు వైద్యవిద్య అంటే అంతగా ఆసక్తి లేదు.. అయిష్టంగానే మెడికల్ ఎంట్రన్స్‌కు హాజరై ఆ తర్వాత వైద్య కళాశాలలో చేరింది.. తరగతులకు హాజరు కావడం మొదలయ్యాక వైద్యవిద్యకు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలుసుకుని కష్టపడి మెడిసిన్ పూర్తి చేసింది.. మొదట్లో ఆసక్తి చూపని వైద్యవిద్యలో అద్భుతాలు సాధించి అందరి చేత ‘ఔరా’ అన్పించుకుంది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మతకాల అపర్ణ ‘పతకాలు’ సాధించి, ఏకాగ్రత ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించింది.
అపర్ణకు చిన్నప్పటి నుంచి గణితం అంటే మహా ఆసక్తి. అందరిలాగే ఐఐటిలో సీటు సాధించి విదేశాల్లో మంచి ఉద్యోగం చేయాలని భావించింది. అయితే- ఇంటర్మీడియట్ తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. హైస్కూల్ రోజుల్లో ఆమె గణితంలో అద్భుత ప్రతిభ కనపరిచింది. సైన్స్ సబ్జెక్టుల కంటే గణితంలో ఘనాపాఠీ అనిపించుకుంది. కానీ, తండ్రి ఆకాంక్షల మేరకు ఇంటర్‌లో బైపీసీ గ్రూపులో చేరింది. తండ్రి మతకాల చలపతిరావు సూర్యాపేటలో ‘్భవానీ నర్స్ ట్రైనింగ్ సంస్థ’ను నిర్వహిస్తుండడంతో అపర్ణ వైద్యవిద్యలో చేరాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో వైద్యకళాశాలలో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌కు హాజరై మంచి ర్యాంకు సాధించింది. కాన్పూర్‌లోని రమా వైద్య కళాశాలలో ఈ ఏడాది ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఆమె ఏకంగా ఎనిమిది బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో అపర్ణ భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాలను

అందుకుంది. సర్జరీ, మెడిసిన్‌లలో రెండు చొప్పున, సబ్జెక్టుల్లో టాపర్‌గా నిలిచినందుకు నాలుగు.. మొత్తం ఎనిమిది బంగారు పతకాలను ఆమె సాధించింది. ఒకేసారి ఇన్ని పతకాలను అందుకోవడం వైద్యవిద్యలో చాలా అరుదని విశ్వవిద్యాలయం అధ్యాపకులు చెబుతున్నారు. అపర్ణను రాష్టప్రతి కోవింద్‌తో పాటు యుపి గవర్నర్ రామ్‌నాయక్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వంటి ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించినపుడే వైద్యవృత్తికి సార్థకత దక్కుతుందని తన అంతరంగాన్ని ఆవిష్కరించిన అపర్ణ తండ్రి ప్రోత్సాహంతోనే తాను ఇంతటి ఘనతను సాధించానని చెబుతోంది. చిన్నప్పటి నుంచి గణితంపై విపరీతమైన మమకారం ఉన్నప్పటికీ, తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యవిద్యలో చేరానని తెలిపింది. అయిష్టంగానే యూపీ సెట్ రాసినా, 356వ ర్యాంకు సాధించి కాన్పూర్‌లోని రమా వైద్య కళాశాలలో చేరింది. నిరుత్సాహంగా మెడిసిన్‌లో చేరినప్పటికీ అందరి అంచనాలను తారుమారు చేసి, అద్భుత విజయాలను తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె సికిందరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా సేవలు అందిస్తోంది.
మెడిసిన్ అంటే మొదట్లో ఇష్టం లేకపోయినా, తన తండ్రి నడుపుతున్న నర్స్ ట్రైనింగ్ సంస్థకు తరచూ వెళుతూ అక్కడి పరిస్థితులను ఆమె పరిశీలించేది. నర్స్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతుల్లో ఆత్మవిశ్వాసం, కారుణ్యం, అంకిత భావం వంటివి తనకు కనిపించేవని అపర్ణ చెబుతోంది. వైద్యరంగంలో సేవలందించే వారికి సమాజంలో గౌరవ మర్యాదలు ఎంతగానో ఉంటాయని ఆమె అవగతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎంబిబిఎస్‌లో చేరాక పుస్తకాలపై దృష్టి సారించింది. ఏ కోర్సులో చేరినా ఏకాగ్రతతో చదవాలని భావించి మెడిసిన్‌లో అద్భుత ప్రతిభ కనపరచింది.
గణితంపై ఆసక్తిని వదులుకుని, వైద్యవిద్యపై మనసు పెట్టి ఏకంగా ఎనిమిది బంగారు పతకాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నిరుపేద వర్గాలకు వైద్యసేవలు అందిస్తానని అపర్ణ అంటోంది. ముఖ్యంగా పల్లెప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెరిగేలా కృషి చేస్తానని ఆమె తన మనోభావాలను ఆవిష్కరిస్తోంది.