యువ

4 కెమెరాలతో నోవా 2ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొబైల్ దిగ్గజం ‘హువాయి’ సంస్థ తన నూతన స్మార్ట్ఫోన్ ‘నోవా 2ఎస్’ను తాజాగా చైనా మార్కెట్‌లో పరిచయం చేసింది. 4.6 జిబి ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.26,350గా నిర్ణయించింది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్ అతి త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి రానుంది.
ఇందులోని ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ఫ్లస్ 2.5 కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160/1080 పిక్సెల్ స్క్రీన్ రిజిల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్, 64/128 జిబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 16, 20 మెగా పిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సెల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జి వీఓఎల్‌టిఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్యూటూత్ 4.2, ఎనఎప్‌సి, యూఎస్‌బి టైప్ సి, 3340 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. మేలైన కెమెరాలు
వెనుక భాగంలో 16, 20 మెగా పిక్సెల్ సామర్థ్యం వున్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను ఈ ఫోన్‌లో అమర్చారు. వీటితో క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ముందు భాగంలోనూ 20, 2 మెగా పిక్సెల్ సామర్థ్యం వున్న మరో రెండు కెమెరాలను ఇచ్చారు. ఇవి సెల్ఫీలను పర్‌ఫెక్ట్‌గా తీసుకునేందుకు పనికొస్తాయి.
ఆండ్రాయిడ్ ఓరియో
ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్లో హువాయి ఇఎయుఐ 8.0కూడా వుంది. ఫోన్ ముందు భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏర్పాటుచేశారు. భారీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ఫోన్ మరో ప్రత్యేక ఆకర్షణ. 6 ఇంచ్ సైజ్‌న్న ఈ భారీ డిస్‌ప్లే వినియోగదారులను ఇట్టే కట్టి పడేస్తుందని కంపెనీ చెబుతోంది.