యువ

‘బుల్లిపిట్ట’ ఇక వార్తల పుట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు సందేశాలను పావురాలు మోసుకొచ్చేవి. ఇపుడు తాజావార్తలను అందించేందుకు ‘బుల్లిపిట్ట’ (ట్విట్టర్) రెడీ అయింది. వార్తల కోసం స్మార్ట్ఫోన్లను ఆశ్రయించే వారి కోసం ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ‘ట్విట్టర్’ తాజా వార్తలను అందించే సేవలను ప్రారంభించింది. ‘బ్లూమ్‌బర్గ్’ మీడియా సౌజన్యంతో విశ్వవ్యాప్త న్యూస్ నెట్‌వర్క్‌ను ‘ట్విట్టర్’ అందుబాటులోకి తెచ్చింది. ‘బ్లూమ్‌బర్గ్’ పాత్రికేయ బృందం సమర్పించే అన్ని రకాల వార్తలు, లైవ్ వీడియోలను ఇపుడు మనం ‘ట్విట్టర్’లోనూ చూడొచ్చు. ఈ వార్తాసేవలకు ‘టిక్‌టాక్’ అని ట్విట్టర్ పేరు పెట్టింది. ఇందుకోసం ‘బ్లూమ్‌బర్గ్’ ప్రత్యేకంగా పాత్రికేయులను, సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసింది. నేటి ఆధునిక యుగంలో మీడియా రూపురేఖలు ఎప్పటికప్పుడు మారుతున్నందున తన ఖాతాదారుల కోసం ట్విట్టర్ ఈ సేవలను అందిస్తోంది. రోజంతా వార్తా విశేషాలను అందించే ‘టిక్‌టాక్’కు ఏడు ప్రముఖ బహుళజాతి సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ కోసం ‘అంతర్జాలం’లో విహరించేవారిని ‘టిక్‌టాక్’ కచ్చితంగా అలరిస్తుందని ‘ట్విట్టర్’ యాజమాన్యం భరోసా ఇస్తోంది.