యువ

నోకియా ‘పాంచ్ పటాకా’!( కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌ఎండి గ్లోబల్’ ద్వారా స్మార్ట్ఫోన్ మార్కెట్‌లోకి నోకియా సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ ప్రేమికుల్లో నోకియా సరికొత్త ఆశలను రేకెత్తించింది. నోకియా బ్రాండ్‌కు సంబంధించి బడ్జెట్, ప్రీమియం సెగ్మెంట్లలో పలు స్మార్ట్ఫోన్లు ఇదివరకే మార్కెట్‌లోకి వచ్చి సత్తాచాటాయి. ఈ కొత్త సంవత్సరంలోనూ అదే ఊపును కొనసాగించేందుకు నోకియా సిద్ధమైంది. అయితే, గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది ఒకేసారి 5 స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు నోకియా కసరత్తు చేసింది. నోకియా నుంచి ఈ ఏడాది నోకియా-9, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారిత నోకియా 1, నోకియా 6 (2018), నోకియా 4, మరో హైఎండ్ ఎడిషన్ నోకియా 7 లేదా నోకియా 7 ప్లస్ కాని మార్కెట్‌లోకి దూసుకురానున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నోకియా 4, నోకియా 7 ప్లస్‌లు ఈ ఏడాది మార్కెట్ తలుపులు తట్టబోతున్నాయని నోకియా కెమెరా యాప్ కూడా తేల్చి చెప్పింది. ముందస్తు నివేదికల ప్రకారం నోకియా 6 (2018), నోకియా 1 ఫోన్లతో నోకియా ఈనెల 9న హెచ్‌ఎండి గ్లోబల్ ప్రకటిస్తుందని తెలిసింది. నోకియా 4, నోకియా 7 ప్లస్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. నోకియా 9 హై ఎండ్ స్మార్ట్ఫోన్‌గా రాబోతున్న నోకియా 9, 5.5 అంగుళాల ఓలెడ్ ప్యానెల్, బెజెల్ లెస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835, 3,250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వెనుకవైపు డ్యూయెల్ కెమెరాలను కలిగి ఉండబోతోంది.
నోకియా-7
5.2 అంగుళాల 1080 పిక్సెల్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్) ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4 జిబి, 6 జిబి), 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కార్ల్‌జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీ, 360 డిగ్రీ క్రిస్టల్ క్లియర్ సౌండ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
నోకియా-9
5.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 చిప్ సెట్, 13 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 8 జిబి ర్యామ్. ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్‌లో రూ.45,000 వరకు ఉండొచ్చు.
నోకియా -1
5 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8 జిబి స్టోరేజ్, డ్యూయెల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (గో ఎడిషన్), 4 జి విఓఎల్‌టిఇ, 4000 ఏంఎహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం.
నోకియా-6 (2018)
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపిఎస్ డిస్‌ప్లే (రిజల్యూషన్ 1920/1080 పిక్సెల్స్) విత్ 2.5 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4 జిబి, 3 జిబి), మైక్రో స్డీ స్లాట్ ద్వారా పోన్ స్టోరేజ్ కెపాసిటీని 128 జిబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4 జి ఎల్‌టిఇ సపోర్టు, వైఫై, ఎన్‌ఎఫ్‌సి సపోర్ట్, మైక్రో యుఎస్‌బి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది.