యువ

సోనీ సరికొత్త మోడల్(కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్స్-ఎ2 ఆల్ట్రా’ పేరుతో మొబైల్ దిగ్గజం సోనీ సంస్థ సరికొత్త స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ ఏడాది బార్సిలోనాలో జరిగే ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ సందర్భంగా ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తారని సమాచారం. ఎక్స్‌పీరియా ఎక్స్ ఎ1 ఆల్ట్రాకు పొడిగింపుగా వస్తున్న ఈ విభిన్న స్మార్ట్ఫోన్ 6 అంగుళాల డిస్‌ప్లే కలిగి వుంటుంది.
ఇందులోని ఫీచర్లు..
1920/1080 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్, 4జిబి రామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 2 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు.
కొన్ని నెలల క్రితమే భారత్‌లో విడుదలైన ఎక్స్‌పీరియో ఎక్స్‌జెడ్1 స్మార్ట్ఫోన్ నీలం, నలుపు, గులాబీ, సిల్వర్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 3డీ క్రియేటర్‌తో విడుదలైన ఈ తొలి మొబైల్ ధరను రూ.44,990/-గా నిర్ణయించారు. ఇందులో 3డీ స్కానర్లను నేరుగా సృష్టించవచ్చు. 3డీ ప్రింటర్‌తో అనుసంధానం చేయవచ్చు. ఐపి 68 సర్ట్ఫికేషన్‌తో వాటర్, డస్ట్ రెసిసెన్స్ ఫీచర్లు ఇందులో అదనపు ఆకర్షణలు. 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డిఆర్ డిస్‌ప్లే, 1920/1080 పిక్సెల్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0 19ఎం.పి మోషన్ కెమెరా, 13 ఎంపి సెల్ఫీ కెమెరా, 4జిబి రామ్, 64 జిబి స్టోరేజ్‌ని 256దాకా విస్తరించుకునే సదుపాయం, 2700 ఎంఎహెచ్ బాటరీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1లోని అదనపు ఫీచర్లు.