యువ

లెనెవో ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఫోన్(కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెనెవో సంస్థ మార్కెట్‌లో తన తొలి ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఫోన్‌ను కె320 టి పేరుతో విడుదల చేసింది. ఈనెల 4నుంచే ఈ ఫోన్ కోసం వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ మొదలయ్యాయి. భారత కరెన్సీలో ఈ ఫోన్ విలువ రూ.9774/-. హారిజాంటల్ డ్యూయెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుకభాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్‌తోపాటు డిజైనింగ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు పూర్తి స్థాయి పాలి కార్బోనేట్ హంగులను సమకూరుస్తుంది. డ్యూయెల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్లు ఫోన్‌కు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. ఫోన్ ముందుభాగంలో 5.7 అంగుళాల ఐపిఎస్ డిస్‌ప్లే ఫర్‌ఫెక్ట్ విజువల్స్‌ను అందిస్తుంది. 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫోన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా వుంటుంది. ఈ ఫోన్ 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ స్ప్రెడ్ ట్రమ్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీనికి 2జిబి రామ్, 16 జిబి స్టోరేజ్ అందుబాటులో వుంటాయి. మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్లు వుంటాయి. ఈ ఫోన్ 3,000 ఎంఎహెచ్ బ్యాటరీపై పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ కనెక్టివిటీ, 2జి, 3జి, 4జి, వైఫై, జిపిఎస్ బ్లూటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టివిటీ ఫీచర్స్ అదనపు ఆకర్షణ. కంపాస్ మెగ్నటోమీటర్, ప్రాక్సిమిటి, యాక్సిలరోమీటర్, గ్రావిటి వంటి సెన్సర్లు వుంటాయి. ఈ ఫోన్ బరువు 153.8 గ్రాములు.