యువ

ఫేస్‌బుక్‌కూ ‘ఆధార’మే..(కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమ పథకాలకు, ఇతర సేవలకు అనుసంధానం చేసినట్లే ఇకపై ‘ఫేస్‌బుక్’ ఖాతాదారులు ‘ఆధార్’ను వినియోగించాల్సిందే. నకలీ ఖాతాలను అరికట్టేందుకు ‘ఆధార్’ను ప్రాతిపదికగా తీసుకోవాలని సామాజిక మీడియా దిగ్గజం అయిన ‘ఫేస్‌బుక్’ నిర్ణయించింది. సెల్‌ఫోన్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారు ఇక ‘ఆధార్’లోని తమ పేరును ఇవ్వాల్సి ఉంటుంది. ‘ఆధార్’లోని పేరు మాత్రం ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలను అరికట్టే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సులభంగా తమ వారిని ‘ఫేస్‌బుక్’లో సులువుగా గుర్తించేందుకు ‘ఆధార్’ దోహదం చేస్తుంది. తాము ‘ఆధార్’లో ఉన్న పేరు మాత్రమే అడుగుతున్నామని, ఇతర వివరాలను తెలపాల్సిన అవసరం లేనందున గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని ‘ఫేస్‌బుక్’ యాజమాన్యం భరోసా ఇస్తోంది. ఖాతాదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వడం ప్రస్తుతానికి ఐచ్ఛికమే అయినప్పటికీ త్వరలో దీనిని తప్పనిసరి చేసే అవకాశం లేకపోలేదు. ఫేస్‌బుక్‌లో తప్పుడు ఖాతాలు కుప్పలుతెప్పలుగా ఉంటున్నందున ‘ఆధార్’ వినియోగంతో వాటి బెడద కొంతవరకైనా తగ్గే వీలుంటుందని ‘ఫేస్‌బుక్’ అంచనా వేస్తోంది.