యువ

కొలువుకోసం కొత్త ట్రెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బులు ఊరికే రావు.. ఇప్పటి వరకూ ఇచ్చింది చాలు..’ అంటూ ఇటీవలి కాలంలో తెగ ప్యాపులర్ అయిన ఓ నగల దుకాణం ప్రకటనను నేటి యువత తమ కోసం కాస్త సవరించుకుని- ‘ఉద్యోగాలు ఊరికే రావు.. ఇప్పటివరకూ కాలక్షేపం చేసింది చాలు.. కాస్త నైపుణ్యం, వైవిధ్యం ఉండాలి..’ అని అనుకోక తప్పదు. ఎందుకంటే డిగ్రీ సర్ట్ఫికెట్లు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలిచ్చే రోజులు పోయాయి. అర్హతలు ఎన్ని ఉన్నా, సంబంధిత రంగంలో నైపుణ్యం ఉంటే తప్ప ఉద్యోగం దక్కని పరిస్థితి నేడు నెలకొంది. ‘ఆటోమేషన్’ పుణ్యమాని ఉద్యోగావకాశాలు నానాటికీ తగ్గుముఖం పడుతున్నందున నియామకాల సందర్భంగా అనూహ్యమైన పోటీ నెలకొంటోంది. నిరుద్యోగులే కాదు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు సైతం నైపుణ్యాలను పెంచుకోవల్సిన అవసరం ఏర్పడింది. ఐటీ రంగం గత ఏడాది నిరాశ పరచినా, ఈ కొత్త సంవత్సరంలో పరిస్థితులు మెరుగై ఉద్యోగావకాశాలు కొంతమేరకు పెరుగుతాయని ‘టీమ్‌లీజ్’ సంస్థ అంచనా వేసింది. ఉద్యోగాలు ఆశించేవారు, ఉద్యోగంలో ఉన్నవారు దానిని కాపాడుకోవాలన్నా నూతన నైపుణ్యాలను అభ్యసించడం కొన్ని రంగాల్లో అనివార్యమవుతోంది. కొన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గినా, మొబైల్స్ తయారీ, ఆర్ధిక సేవల సాంకేతికత, అంకుర సంస్థల్లో అవకాశాలుంటాయి. డిజిటలీకరణ కోసం డిజిటల్ సాంకేతికతలో నైపుణ్యం ఉన్న 50 శాతం మంది అదనంగా అవసరం అవుతారు. కొత్తతరం సాంకేతికతల వినియోగానికి డిజిటల్ నైపుణ్యాలున్న ఉద్యోగుల అవసరం ఎంతో ఉందని ‘అడోబ్ ఇండియా’ ఓ సర్వేలో తేల్చింది. అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు బయటకు పోకుండా సంబంధిత సంస్థలు కాపాడుకోవడం కూడా ఓ సవాలుగా మారనుంది.
నవీకరణ వైపు ఆసక్తి..
ఐటీ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక నైపుణ్యాలను ఆకళింపు చేసుకుని ఎక్కువమంది నిపుణులు తమను తాము నవీకరించుకుంటున్నారు. నైపుణ్యాల నవీకరణపై జరిగిన తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఐటీలో 5ఏళ్ల అనుభవం ఉన్నవారు ఆధునిక సాంకేతిక నైపుణ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యం సాధించాలనే తపన సీనియర్‌లో వ్యక్తమవుతోంది. ఏఐ/ఎంఎల్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే వ్యవస్థలు ఏర్పాటు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆటోమేషన్’ ప్రభావంతో నీరసపడిపోవడానికి బదులు నూతన సాంకేతికతను అలవరచుకుంటే కెరీర్ ఉజ్వలంగా ఉంటుందని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.
లెక్కకు మించి డిగ్రీలున్న వారికి ఇపుడు నియామక పత్రాలు అందే పరిస్థితి లేదు. సరికొత్త సాంకేతిక నైపుణ్యాలున్న వారికే ప్రముఖ సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ఇపుడు ఉద్యోగార్థులకు అదనపు అర్హత. ఉద్యోగ నియామక ప్రక్రియలో కొత్త ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కసన్, పర్సనాలిటీ టెస్ట్‌లు, ప్రెజంటేషన్లు, నివేదికలు వంటివి ఇపుడు అవసరం అవుతున్నాయి. ఇవన్నీ నూతన నైపుణ్యాలలో భాగమే. విద్యార్హతలు ఏవి ఉన్నా, సాంకేతిక నైపుణ్యం అవసరం ఎంతో ఉంది. ఉద్యోగం కోసం అనే్వషించేవారే కాదు, ఉద్యోగం చేస్తున్నవారు కూడా సరికొత్త నైపుణ్యాలను ఆకళింపు చేసుకోవాల్సిందే. మార్కెట్ ట్రెండ్స్, వినియోగదారుల సైకాలజీ వంటి అంశాలను ముందే తెలుసుకోవాలి. సోషల్ మీడియాను, మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేవారే ఇంటర్వ్యూలో ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుంది. మారిన ‘ట్రెండ్’తో పాటు ‘అప్‌డేట్’ అయినపుడే ఉద్యోగార్థుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.