యువ

సాహసమే శ్వాసగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనాలే తప్ప నిరాశతో నీరసపడకూడదని ‘మహిళా స్టంట్ రైడర్’గా సత్తా చాటుకుంటున్న 22 ఏళ్ల అనమ్ హషీమ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అమ్మాయిలకు ‘రోల్ మోడల్’గా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని, మగువలు సాహసం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని అంటోంది. మహిళలను స్టంట్ రైడర్లుగా తీర్చిదిద్దేందుకు ఓ జాతీయ స్థాయి అకాడమీని ఏర్పాటు చేయాలన్నదే తన భావి ప్రణాళిక అని హషీమ్ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. భారత్‌లో స్టంట్ రైడింగ్‌ను వృత్తిగా చేసుకున్న ఏకైక మహిళగా ప్రఖ్యాతి పొందిన ఆమె ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు’లో పాల్గొని స్టంట్ రైడింగ్ అంటే పురుషులకు సంబంధించిన విద్య కాదని చాటింది. మోటార్ బైకింగ్ రంగం నుంచి ఈ సదస్సులో పాల్గొన్న ఏకైక ప్రతినిధిగా ఆమె తన విశిష్టతను చాటుకుంది.
గత ఏడాది మే నెలలో జకార్తాలో జరిగిన ‘జింఖానా స్టంట్ రైడ్ పోటీల’లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న హషీమ్ ‘బైక్ రైడింగ్’ అనేది ఎన్నటికీ ‘తీరని దాహం’ లాంటిదని చెబుతోంది. ప్రపంచంలోనే మూడవ అతి ఎత్తయిన ‘ఖర్దంగ్ లా’ శిఖరంపైకి చేరుకుని రికార్డు సృష్టించిన ఆమె 2015లో ‘బైక్ రైడింగ్’ను ఎంచుకుంది. ‘ఖర్దంగ్ లా’పైకి చేరుకున్న పిన్న వయస్కురాలిగా ఇరవై ఏళ్ల ప్రాయంలోనే ఘనతను సాధించిన ఆమె మరిన్ని లక్ష్యాలను సాధించేందుకు దూసుకుపోతోంది. ‘ఖర్దంగ్ లా’ శిఖరంపైకి చేరుకున్నాక ఆమెను అంతా ‘సెలబ్రిటీ’ మాదిరి చూడడం ప్రారంభించారు. ‘స్టంట్ రైడర్’గా విన్యాసాలను ప్రారంభించిన తొలినాళ్లలో హషీమ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. స్టంట్ రైడర్‌గా తాను చేసిన సాహసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియాలను ఆమె సోషల్ మీడియాలో ఉంచడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. పాఠశాల రోజుల్లో తనకు సాహస క్రీడలంటే ఎంతో మక్కువ అని చెప్పే ఆమె- బైక్‌లపై కుర్రాళ్లు చేసే విన్యాసాలను చూసి తాను కూడా అలాగే ‘స్టంట్ రైడింగ్’ చేయాలని ఆరాటపడేది. 15 ఏళ్ల ప్రాయంలోనే స్టంట్ రైడింగ్ పట్ల ఆమెలో ఆసక్తి పెరిగింది. అయితే, సొంతంగా ఓ ‘రేసింగ్ బైక్’ను కొనేంత వరకూ కొనే్నళ్లపాటు నిరీక్షించక తప్పలేదని ఆమె తన జ్ఞాపకాలను వివరిస్తోంది.
అడ్డంకులను అధిగమించి..
సొంతంగా రేసింగ్ బైక్‌ను కొనుక్కున్నా బహిరంగంగా విన్యాసాలు చేసేందుకు హషీమ్‌కు తొలినాళ్లలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఆడపిల్ల బైక్ నడపడాన్ని అంతా వింతగా చూసేవారు. ఇక బైక్‌పై విన్యాసాలంటే మరీ విడ్డూరంగా మాట్లాడుకునేవారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఆమె ప్రాక్టీస్ చేసేది. కొంతమంది బైక్ మెకానిక్‌లు కూడా ఆమెను నిరుత్సాహపరిచారు. శారీరక దారుఢ్యం (్ఫట్‌నెస్) ఉంటే తప్ప ఇలాంటి విన్యాసాలను చేయడం కష్టమని ఆ దిశగా ఆమె ప్రయత్నాలు చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యం ఉంటే ఎలాంటి సాహస క్రీడల్లోనైనా అనుకున్నది సాధించవచ్చని ఆమె చెబుతోంది. ‘స్టంట్ బైకింగ్’ మగాళ్లకు సంబంధించిన క్రీడాంశం అని, దీనిని అమ్మాయిలు వృత్తిగా చేసుకునేందుకు అవకాశం లేదని హషీమ్ తల్లిదండ్రులు కూడా అనేవారు. పూణెలో ఇంజినీరింగ్ చదవాలని ఆమెపై పేరెంట్స్ వత్తిడి తెచ్చేవారు. అయితే, బైక్ రైడింగ్ పట్ల తపన ఉన్న హషీమ్ తాను ఎంచుకున్న మార్గంలోనే పయనిస్తానని తల్లిదండ్రులను ఒప్పించింది. సొంతంగా రేసింగ్ బైక్‌ను 2013లో కొనుక్కున్నాక, లక్ష్యసాధన కోసం నిత్యం సాధన చేయడం ఆమెకు అలవాటుగా మారింది. మన దేశంలో ఇప్పటికీ సాహస క్రీడలను పురుషులకు పరిమితం చేయడం సరికాదని ఆమె అంటోంది. ఎవరిపైనా ఆధారపడకుండా లక్ష్యసాధన కోసం చేసే కృషిలో ఆత్మసంతృప్తికి అంతులేదని చెబుతోంది.
మన దేశంలో బాలికలను క్రీడారంగంలో ప్రోత్సహించడం అరుదని, అలాంటిది స్టంట్ రైడింగ్ వంటి సాహస కృత్యాల్లో ప్రవేశించడం దుర్లభమని, ఈ పరిస్థితులు మారితేనే మహిళలు సమానత్వాన్ని సాధించినట్టు అవుతుందని హషీమ్ అంటోంది. బాలికల ఇష్టాలను గమనించి వారు ఆసక్తి చూపే రంగంలో పేరెంట్స్ ప్రోత్సహించాలని అంటోంది. స్టంట్ రైడింగ్‌కు సరైన వసతి సౌకర్యాలు, మైదానాలు సమకూర్చాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది. స్టంట్ రైడింగ్‌లో గాయాలు తగలడం సహజమని, అంతమాత్రాన దీనిని ప్రాణాంతక క్రీడగా పరిగణించరాదని సూచిస్తోంది. ఓసారి స్టంట్ రైడింగ్ సందర్భంగా తన తలకు గాయమైందని, అయితే అదృష్టవశాత్తూ చిన్న గాయం కావడంతో తిరిగి సాధన ప్రారంభించానని తెలిపింది. స్టంట్ రైడింగ్ చేసేవారు విధిగా హెల్లెట్ ధరించాలని సలహా ఇస్తోంది. ప్రభుత్వాలు కూడా రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలని కోరుతోంది. తగిన సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటే అమ్మాయిలు స్టంట్ రైడింగ్‌లో రాణించడం కష్టమేమీ కాదంటోంది.
కాలం మారుతోంది..
గతంతో పోల్చిచూస్తే భారత్‌లో ఇటీవలి కాలంలో పరిస్థితులు మారుతున్నాయని, అమ్మాయిలు వారికి నచ్చిన రంగంలో కృషి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని హషీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. సాహస క్రీడలను ప్రోత్సహించేందుకు తగిన వేదికలుండాలని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గమ్యం వైపు దూసుకుపోవాలని ఆమె అంటోంది. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాలు సాహస క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించాలంటోంది. స్టంట్ రైడింగ్‌ను ఒక క్రీడగా గుర్తించి, అందులో అమ్మాయిలను ప్రోత్సహించాలని కోరుతోంది. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్ని స్టంట్ రైడింగ్‌లో భారత్ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించాలన్నదే తన ధ్యేయమని హషీమ్ చెబుతోంది.