యువ

స్మార్ర్టాన్ నుంచి ‘టి. ఫోన్ పి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఆర్‌టి ఫోన్ పేరిట గతంలో ఓ స్మార్ట్‌పోన్‌ను లాంఛ్ చేసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన స్మార్ర్టాన్ కంపెనీ మరో సరికొత్త స్మార్ట్ఫోన్‌తో బడ్జెట ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టబోతోంది. టి ఫోన్ పి పేరుతో ఈ బ్రాండ్ లాంఛ్ చేసిన నూతన స్మార్ట్ఫోన్ జనవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,999.
ఎనె్నన్నో ఆకర్షణలు..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజి కెపాసిటీని 128 జిబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఏంఏహెచ్ బ్యాటరీ, 4జి ఓల్ట్ కనెక్టువిటీ, వైఫు బ్లూటూత్, యూఎస్‌బి ఆన్ ద గో సపోర్టు.
డిజైన్ డిస్‌ప్లే ఇలా..
స్మార్ట్ఫోన్ టి. ఫోన్ పి మన చేతుల్లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఈ ఫోన్ ఆఫర్ చేసి గ్రిప్ కంఫర్టబుల్ ఫీల్‌ను స్మార్టాన్ చేరువ చేస్తుంది. లైట్ వెయిట్‌కు తోడు గుండ్రటి కార్నర్స్ ఫోన్‌కు మంచి ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఈ డివైస్ ఎస్‌ఆర్‌టి ఫోన్‌లా కాకుండా పూర్తి స్థాయి మెటల్ బాడీతో సిద్ధమైంది. దీనికి సంబంధించి పవర్ బటన్స్, వాల్యూమ్ రాకర్స్ కుడి చేతి భాగంలో, హైబ్రిడ్ సిమ్ ట్రేను ఎడమ చేతివైపు భాగంలో ఏర్పాటుచేశారు. ఫోన్ పైభాగంలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను, మైక్రో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్టును కింది భాగంలో పొజిషన్ చేసి ఉంచారు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చసిన 5.2 ఇంచ్ ఫుడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేకు, 2.5 డి కర్వుడ్ గ్లాస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తున్న విజువల్స్ మొదటి లుక్‌లో ఆకట్టుకునే విధంగా ఉన్నయి. ఇందులోని వ్యూవింగ్ యాంగిల్స్ కూడా అదిరేలా ఉన్నాయి. ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్‌ల విషయంలో సంతృప్తిని కలిగించేలా, రూ.8వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉంచిన ఈ స్మార్ట్‌పోన్‌కు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ ఓ హైలెట్‌గా నిలుస్తుంది. 3 జిబి ర్యామ్ 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్, మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ ఫోన్‌పై అదనంగా 1000 క్లౌడ్ స్టోరేజ్‌ను స్మార్ర్టాన్ ఉచితంగా అందిస్తోంది. డ్యూయల్ నానో సిమ్‌లకు తోడు ఈ ఫోన్‌లో ఏర్పాటుచేసిన డెడికేటెడ్ మైక్రో ఎస్‌డి స్లాట్‌ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128 జిబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.
13 మెగా పిక్సెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. టి ఫోన్ పి హ్యాండ్ సెట్‌లో రెండు అప్‌డేటెడ్ కెమెరాలను స్మార్ర్టాన్ పొందుపరిచింది. ఫోన్ వెనుకభాగంలో నిక్షిప్తం చేసిన 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా, ఎల్‌ఇడి ఫ్లాష్‌లైట్ సపోర్టుతో తక్కువ వెలుతురులోనూ హై క్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తోంది. బ్యూటిఫై మోడ్, పానోరమా, టైమ్‌ల్యాప్స్, మల్టీఎక్స్‌పోజర్, బరస్ట్ వంటి ప్రత్యేకమైన మోడ్స్‌ను ఈ కెమెరా యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికొస్తే 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను టి.్ఫన్ పి కలిగివుంది. బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్ పనితీరు టి ఫోన్ పి హ్యాండ్ సెట్‌కు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలెట్‌గా నిలుస్తుంది. ఇంచుమించు ఇదే బడ్జెట్‌లో లభ్యమవుతున్న మైక్రోమాక్స్ భారత్ 5, ఇన్‌ఫోకస్ టర్బో 5 వంటి స్మార్ట్ఫోన్‌ల నుంచి ఈ డివైస్‌కు తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశముంది.