యువ

స్నాప్ డ్రాగన్ 845

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది విడుదల కాబోతున్న అత్యంత శక్తిమంతమైన స్మార్ట్ఫోన్‌లలో వన్ ప్లస్ 6 ఒకటి. జూన్‌లో విడుదల కావచ్చని అంచనా వేస్తున్న ఈ భిన్నమైన స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌పై రన్ అవుతుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా వన్ ప్లస్ సిఇఓ ఈ వివరాలను తెలియజేశారు. వన్ ప్లస్ 6 స్మార్ట్ఫోన్‌కు తరువాత వెర్షన్ వన్ ప్లస్ 6 టి. అయితే- ఇది ఈ ఏడాది మార్కెట్‌లో ఎపుడు విడుదల అవుతుందన్న విషయమై ఆయన స్పష్టతనివ్వలేదు. యుఎస్ మార్కెట్లో లోకల్ క్యారియర్ల ద్వరా వన ప్లస్ 6ను లాంఛ్ చేయబోతున్నట్లు వన్‌ప్లస్ బ్రాండ్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన తెలిపారు.
ఇందులోని ప్రత్యేకతలు
చిప్‌సెట్ వున్న ఇంటిగ్రేటెడ్ ఎక్స్ 20 ఎల్‌టిఇ మోడెమ్ మొబైల్ ఫోన్‌లలో గరిష్టంగా 1.2 జిబిపిఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇస్తుంది. ఈ చిప్‌సెట్ వున్న స్మార్ట్ఫోన్‌లో డ్యూయెల్ సిమ్, డ్యూయల్ ఓల్ట్ పనిచేస్తుంది. అంటే ఓల్ట్ ఈ కెపాసిటీ ఉన్న రెండు సిమ్ కార్డులను ఒకేసారి స్టాండ్‌బైలో ఉంచవచ్చు. ఇప్పటి ఫోన్‌లో మాదిరిగా 4జి ఓల్ట్ కావాలంటే సిమ్‌ను స్విచ్ చేయాల్సిన పనిలేదు. ఇక ఈ చిప్‌సెట్‌లో ఏర్పాటుచేసిన అడ్రినో 630 జిపియు గతంలో వచ్చిన చిప్‌సెట్స్‌కన్నా వేగవంతమైన గ్రాఫిక్స్‌ను ఆఫర్ చేస్తుంది.