యువ

తొలి ఆండ్రాయిడ్ గో మొబైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైక్రోమ్యాక్స్ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి తొలిసారిగా ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్‌ను లాంచ్ చేసేందుకు తుది సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దేశంలో ఆండ్రాయిడ్ ఓరియో గో స్మార్ట్ఫోన్‌ను లాంఛ్ చేస్తున్న తొలి కంపెనీ మైక్రోమ్యాక్స్ కావడం విశేషం. ‘్భరత్ గో’ పేరుతో కంపెనీ ఈ ఫోన్‌ను లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ డివైస్
512 ఎంబి టు 1 జిబి రామ్‌తో వచ్చే అవకాశం వున్న ఈ స్మార్ట్ఫోన్‌ను బెస్ట్ ఇన్ క్లాస్ మొబిలిటీ డివైజ్, ఆప్టిమైజ్ ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ డివైజ్‌గా మైక్రోమ్యాక్స్ కంపెనీ అభివర్ణించింది.
ఐదువేల రూపాయల కంటే తక్కువే..
ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే ఈ స్మార్ట్ఫోన్ ధర ఉంటుందని, 4జి, వాయిస్ ఓవర్, ఎల్‌టిఇ సపోర్టు ఫీచర్లతో ఇది మార్కెట్‌లోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్)తో ఇది రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో.. ఎంట్రీ లెవెల్ డివైస్‌లు సమర్థవంతంగా పనిచేయడానికి ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ను గూగుల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో దీన్ని లాంఛ్ చేస్తున్నట్లు గత నెలలోనే గూగుల్ పేర్కొంది. ఈ ఓఎస్ ముఖ్యంగా 1 జిబి కంటే తక్కువ ర్యామ్, తక్కువ స్టోరేజ్ స్పేస్ కలిగిన స్మార్ట్ఫోన్‌లలో అతివేగంగా పనిచేస్తుంది. ఫీచర్ ఫోన్ పాపులర్‌గా ఈ మోడల్ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్ వాడకాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌తో వస్తున్న భారత్ గో స్మార్ట్ఫోన్ ఫీచర్లను, ధరను మైక్రోమ్యాక్స్ వెల్లడించనప్పటికీ, తొలిసారి స్మార్ట్ఫోన్ వాడే యూజర్లకు ఇది మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుంతోంది. ఈ గో ఫీచర్లో గూగుల్ గో, గూగుల్ అసిస్టెంట్ గో, యు ట్యూబ్ గో, గూగుల్ మాప్స్ గో, జిమెయిల్ గో, జిబోర్డ్, గూగుల్ ప్లే, క్రోమ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.