యువ

‘ఫేస్‌బుక్’కు కొత్త సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో ఎవరివద్దయినా స్మార్ట్ఫోన్ ఉందంటే.. కచ్చితంగా అందులో ‘ఫేస్‌బుక్’ యాప్ ఉండి తీరాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ రికార్డు స్థాయి వినియోగదారులతో నానాటికీ ముందుకు దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త అప్‌డేట్స్‌ను, ఫీచర్లను పరిచయం చేస్తూ ఈ ‘సామాజిక వేదిక’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఫేస్‌బుక్ మరో పెద్ద అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఫేస్‌బుక్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ఆ సంస్థ సిఇఓ మార్క్ జూకర్ బర్గ్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో తాము ఇచ్చే సమాచార పద్ధతిలో మార్పులు చేస్తున్నట్లు ఆయన సూచన ప్రాయంగా తెలిపారు. ఇది ఇన్ని రోజులు వ్యాపార లావాదేవీలకు సౌకర్యంగా ఉండేదని, కాని ఇప్పుడు ఇందులో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకునేలా సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జూకర్‌బర్గ్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించి మంచి చెడులు చూసేందుకు, వారి సంక్షేమం కోసం ఫేస్‌బుక్ పనిచేస్తుందని చెప్పాల్సిన బాధ్యత తమపై వుందని తాను, తన బృందం అభిప్రాయపడినట్లు చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఇలాంటి మార్పులు సహజమని చెప్పిన జూకర్‌బర్గ్, వ్యాపార సంస్థలు ఫేస్‌బుక్‌ను ఉపయోగించకపోయినా ఫర్వాలేదన్నారు. ప్రజలకు అనుగుణంగా వుంటే చాలు అని అన్నారు. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా కొన్ని సందర్భాల్లో వదంతులు, తప్పుడు వార్తలు వచ్చాయి. వీటితో కొందరు యూజర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2016లో రష్యా ఎన్నికల్లో ఇలాంటి చేదు అనుభవాలను కొందరు చవిచూశారు. అయితే అలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించి ఫేస్‌బుక్ కొన్ని మార్పులు ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్‌లో అనవసర కంటెంట్‌ను తగ్గించేలా తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ అప్‌డేట్స్‌వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
తమకు ఇష్టమైన వారితో మాట్లాడటం, న్యూస్ ఆర్టికల్స్ చదవడం, షేర్ చేసిన వీడియోలను చూడటం వంటివి ఇక ఫేస్‌బుక్‌లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది తాను ఉద్దేశించినట్లుగా మిషన్ సామాజిక నెట్‌వర్క్‌ను పరిష్కరించానికి, దుర్వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతామని జుకర్‌బర్గ్ అంటున్నారు. దీనికోసమే ఫేస్‌బుక్ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుందన్నారు. మరింత అర్థవంతంగా, సామాజికంగా ఉపయోగపడే చర్యలకు సహాయపడటానికి అవసరమైన కంటెంట్ కనుగొనేలా చేయడంలో సహాయం చేస్తామంటున్నారు. దీన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతామని జుకర్‌బర్గ్ భరోసా ఇస్తున్నారు.