యువ

డౌన్‌లోడ్స్‌లో అ‘ద్వితీయం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుర్రకారే కాదు, అన్ని వయసుల వారూ నేడు స్మార్ట్ఫోన్లు వాడుతూ ‘అంతర్జాలం’లో విహరిస్తున్నందున మొబైల్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విషయంలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, అమెరికాను వెనక్కి నెట్టేసి భారత్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిందని ‘యాప్ ఎన్నీ’ సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. యాప్ ఎకానమీలో భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని, భారతీయులు నెలకు సగటున 40 యాప్‌లు వినియోగిస్తున్నారని తేలింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐవోఎస్ స్టోర్, థర్డ్‌పార్టీ ఆండ్రాయిడ్ స్టోర్స్ నుంచి గణాంకాలను సేకరించగా యాప్‌ల డౌన్‌లోడ్‌లో మన దేశం శరవేగంగా దూసుకుపోతోంది. గత ఏడాది భారత్‌లో యాప్‌ల వినియోగం 215 శాతం మేరకు విస్తరించగా, అదే కాలంలో అమెరికాలో 5 శాతం మేరకు యాప్‌ల వాడకం పెరిగింది. రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్లు అపరిమిత 4జీ సేవలు, పలు రాయితీలను ఇస్తున్నందున యాప్‌ల వాడకం అనూహ్యంగా పెరిగింది. చైనా వీడియో బిగ్ లైవ్, గూగుల్ డ్రైవ్‌లపై భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ‘తీన్ పట్టీ’ భారత్‌లో టాప్ గేమింగ్ యాప్‌గా ఘనత సాధించింది. డౌన్‌లోడ్‌లకు సంబంధించి డేటింగ్ యాప్ ‘టిండర్’, ఓవర్ ద టాప్, వినోదాల వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ ముందు వరసలో నిలిచాయి.