యువ

కార్బన్ నవీన ఆవిష్కరణలు (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత కార్బన్ కంపెనీ తన నూతన స్మార్ట్ఫోన్ టైటానియం ఫ్రేమ్స్ ఎస్7ను తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను వినియోగదారులు షాప్‌క్లూస్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధరను కంపెనీ రూ.6999గా నిర్ణయించింది. 5.5 అంగుళాల డిస్‌ప్లే, 3 జిబి ర్యామ్, 13 మెగా పిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు తదితర ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఏర్పాటుచేశారు. పరింతగా మెటల్ ఫినిషింగ్‌తో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. దీంతో ఈ సరికొత్త ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. మరోవైపు ఎయిర్‌టెల్ సంస్థ ఈ ఫోన్‌మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ కొన్న తరువాత వినియోగదారులు ఎయిర్‌టెల్ సిమ్ వేసి నెలకు రూ.199, ఆపైన ప్లాన్‌తో 36 నెలలపాటు వాడితే రూ.2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు.
ఆకట్టుకునే ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ఐపిఎస్ 2.5 కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920/1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జి ఓల్ట్, బ్లూటూత్, 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
కార్బన్ కె9
ఇటీవలే విడుదలైన ఈ ఫోన్ ధర రూ.5,290. ఫీచర్ల విషయానికివస్తే 5.2 ఇంచ్ డిస్‌ప్లే, 480/8534 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8 జిబి స్టోరేజ్, 32 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగా పిక్సెల్ బ్యాక్ కెపెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4జి ఓల్ట్, 2300 ఎంఎహెచ్ బ్యాటరీ.
ఔరా 9 స్టార్ ఫోన్
దీని ధర 6,999. ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ, 1 జిబి ర్యామ్, 8 ఎంపి రియర్ కెమెరా, 8 జిబి మెమొరీ, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఆరా స్లీక్ 4జి
దీని ధర రూ.5,290, 5 ఇంచ్ డిస్‌ప్లే, 1.25 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 32 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఇడి ఫ్లాడ్, 2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4జి ఓల్ట్, 2000 ఎంఎహెచ్ బ్యాటరీ.
ఆరా నోట్ 4
దీని వెల రూ.6890, 5.5 ఇంచ్ హెచ్‌డి డిస్‌ప్లే, 720/1280 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 32 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 5మెగా పిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జి ఓల్ట్, 2800 ఎంఎహెచ్ బ్యాటరీ.
స్మార్ట్ఫోన్ల వెల్లువ
మన దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగం నానాటీకీ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ కొత్తకొత్త ఆకర్షణలతో తమ స్మార్ట్ఫోన్లను మార్కెట్‌లోకి వదులుతున్నాయి. విదేశీ కంపెనీలకు పోటీగా దేశీయ కంపెనీలు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న మొబైల్స్‌ను విడుదల చేస్తూ మార్కెట్‌లో సత్తాచాటేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల్లో మార్కెట్లోకి అనేక కంపెనీల ఫోన్లు వచ్చాయి. అత్యాధునిక ఫీచర్లతో, అత్యంత తక్కు ధరలో ఈ ఫోన్లు భారతీయ మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యాయి. ఈ కామర్స్ సైట్లతో పాటు ఆఫ్ లైన్ మార్కెట్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.
ఒప్పో ఎ83
ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వచ్చిన ఈ మొబైల్ ధర రూ.13,990. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైట్లలో ఇది అందుబాటులో ఉంది. ఒప్పో ఎ 83 స్పెసిఫికేషన్స్- 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ 2.5 డిగ్రీల పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్యా డబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, డ్యూయల్ సిమ్, 13 మెగా పిక్చెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4 జి ఓల్ట్, బ్లూటూత్ 4.2, 3180 ఎంఎహెచ్ బ్యాటరీ.
హువావ్ ఆనర్ 9 లైట్
18:9 ఆస్పెక్ట్ రేషియోతో 5.65 ఇంచ్ సైచ్ వున్న భారీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మన దేశంలో రంగప్రవేశం చేసింది. దీని ధర 32/64 వేరియెంట్స్‌లో వరుసగా రూ.10,999, రూ.14,999. 3/4 జిబి ర్యామ్, ఈనెల 21నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. హువావ్ ఆనర్ 9 లైట్ స్పెసిఫికేషన్స్ 5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డి 2.5 డిఎమ్ 1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జిబి ర్యామ్, 32/84 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్యా డబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13.2 మెగా పిక్సెల్, డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13.2 మెగా పిక్సెల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4 జి ఓల్ట్, బ్లూటూత్ 3.2, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ.
శాంసంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్
ముందు వెనుక భాగాల్లో 13 మెగా పిక్సెల్ కెమెరాలతో ఈ ఫోన్ రిలీజ్ అయింది. 3/4 జిబి రామ్, 32/64 జిబి స్టోరేజ్, వేరియెంట్స్ ధరలు వరుసగా రూ.12,990, 14,990. ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో ఈనెల 20 నుండి అందుబాటులో వుంది. శాంసంగ్ గెలాక్సి ఆన్ 7 ప్రైమ్ స్పెసిఫికేషన్స్- 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920/1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెట్జ్ ఆక్టా ప్రాసెసర్, 3/4 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్యా డబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్, డ్యూయల్ సిమ్, 13 మెగా పిక్సెల్ బ్యాక్, ఫ్రెంట్ కెమెరాలు, 4జి ఓల్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 4.1, 3,000 ఎంఎహెచ్ బ్యాటరీ.
షియోమికి శాంసంగ్ సవాల్
మన దేశంలో ఎప్పటి నుంచో నెంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌కు చైనా కంపెనీ షియోమి షాక్ ఇచ్చింది. శాంసంగ్ స్థానాన్ని వెనక్కి నెట్టేస్తూ ఇండియాలో నెంబర్ వన్‌గా ఆధిక్యత చూపింది. ఆకట్టుకునే ఫీచర్లతో చాలా తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తున్న షియోమి వినియోగదారులను ఇట్టే కట్టిపడేస్తోంది. షియోమి వ్యూహాన్ని పసిగట్టిన శాంసంగ్ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆ సంస్థ అనుసరించిన విధానాలనే పాటించాలని చూస్తోంది.
ముందుగా ఆన్‌లైన్ అమ్మకాలు
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ ఏ కొత్త మోడల్‌ను విడుదల చేసినా ముందుగా ఆన్‌లైన్‌లో ఫ్లాష్ సేల్ ద్వారా వాటిని విక్రయిస్తుంది. తరువాత నెమ్మదిగా వాటిని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అమ్మడం ప్రారంభిస్తుంది. దీంతో వీలైనన్ని ఎక్కువ ఫోన్లు అమ్మడమే కాదు, ఆన్‌లైన్‌లో అమ్మడం ద్వారా ఎవరికీ కమీషన్ చెల్లించాల్సిన పని ఉండదు. దీంతో ఫోన్ మరింత తక్కువ ధరకే అందించవచ్చు. మొదటి నుంచీ షియోమీ ఇదే పంథాతో ముందుకు సాగుతుండగా, ఇపుడు అదే బాటలో శాంసంగ్ నడవనుంది.
త్వరలో శాంసంగ్ షియోమీకి పోటీగా కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను తన ఆన్ సిరీస్‌లో విడుదల చేయనుంది. వీటి ధరలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే శాంసంగ్ వీటిని మొదటగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే అది కూడా ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిసింది.
అందుబాటు ధరల్లో...
ఆన్‌లైన్‌లో కూడా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ప్రయారిటీ సెల్లర్స్ ద్వారా శాంసంగ్ తన ఫోన్లను విక్రయించాలని చూస్తున్నది. ఈ విషయాను ఎకనామిక్స్ టైం రిపోర్టు చేసింది. కాగా ఈ ఫోన్లు రూ.5 వేల నుంచి రూ.15 వేల రేంజ్‌లో ఉంటాయని సమాచారం.