యువ

రూ.12వేలకే విండోస్-10 ల్యాప్‌టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైక్రోసాఫ్ట్ నుంచి అతి త్వరలో అత్యంత తక్కువ ధరకే అత్యాధునిక ల్యాప్‌టాప్ దూసుకురానుంది. లెనెవో, జెపి సంస్థలతో కలిసి మైక్రోసాఫ్ట్ అతి త్వరలోనే రూ.12వేల ప్రారంభ ధరలో విండోస్ 10, విండోస్ 10 ఎస్ పేరిట విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ ల్యాపీని ఆవిష్కరిస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లలో వారికి పనికొచ్చే ఆఫీస్-365 ఎడ్యుకేషనన్ సాఫ్ట్‌వేర్, స్టెమ్ లెర్నింగ్, ఇతర వీడియో టూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
లెనెవో నుంచి 100ఇ, 300ఇ
లెనెవో కంపెనీ 100ఇ, 300ఇ 2 ఇన్ 1 పేరిట రెండు ఎడ్యుకేషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనుండగా వీటిల్లో ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్, 11.6 ఇంచ్ డిస్‌ప్లే, 2/4 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్, హెచ్‌డి కెమెరా, 10 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు అలరిస్తాయి.
క్లాస్‌మేట్ లీప్ టి 303
జెపి కంపెనీ క్లాస్‌మేట్ లీప్ టి303, ట్రిగొనొ వి401 2 ఇన్ 1 పేరిట పెన్, టచ్ సపోర్టు ఉండే విధంగా రెండు ఎడ్యుకేషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనుంది. ఈ నాలుగు లాప్‌టాప్‌లలోనూ విండోస్ 10 స్టూడెంట్ ఎడిషన్ ఓఎస్‌ను అందివ్వనున్నారు. కానీ, ఈ ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లోకి ఎప్పుడు వచ్చేది మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. లెనొవో తన నూతన 2 ఇన్ 1 ల్యాప్‌టాప్ యోగా 920 వైబ్స్‌ను లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా రూ.1,27,159 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది.
ఐపిఎస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే
ఇందులో 13.9 ఇంచ్ యుహెచ్‌డి ఐపిఎస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్, 16 జిబి ర్యామ్, 512 జిబి ఎస్‌ఎస్‌డి, డాల్బీ ఆట్మోస్, విండోస్ 10 హోమ్ ఓఎస్, 720 హెచ్‌డి వెమ్ కెమెరా, యుఎస్‌బి టైప్ సి, 10 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు వున్నాయి.
గూగుల్ పిక్సెల్ బుక్
గత ఏడాది ఈ ల్యాపీని గూగుల్ సంస్థ లాంఛ్ చేసింది. దీనిని లాప్‌టాప్‌గాను, ట్యాబ్లెట్ పీసీగాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో 12.3 ఇంచ్ డిస్‌ప్లే, 2400/1600 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, 8/16 ర్యామ్, 128/256/512 జిబి స్టోరేజ్, హెచ్‌డి వెబ్‌క్యామ్, క్రోమ్ ఓఎస్, డ్యూయెల్ బ్యాండ్ ఐపై, బ్లూటూత్, 4.2 యుఎస్‌బి టైప్ సి, 4 కె డిస్‌ప్లే అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.65 వేల ప్రారంభ దశకు ఈ ల్యాప్‌టాప్ ఈనెల 31వ తేదీ నుంచి లభ్యం కానుంది.