యువ

వెదురే కదాని తీసిపారేయొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఓ సైకిళ్ల కంపెనీ. పేరు కాల్ఫీ డిజైన్. ఎప్పుడూ ఒకే రకం సైకిళ్లే తయారు చేసి...చేసి విసుగొచ్చిందట ఈ కంపెనీవారికి. ఈసారి ఏకంగా వెదురుతోనే సైకిల్ చేసి మార్కెట్లోకి వదిలారు. ఇంకేముంది...ఈ కొత్త తరహా సైకిల్‌కు బోలెడు గిరాకీ వచ్చేసిందట. ఇంతకీ ఈ సైకిల్ పేరేమిటనుకున్నారు...కార్ కిల్లర్. ఇదేం పేరు అనేగా మీ సందేహం? కారుకు పట్టే స్పేస్ ఈ సైకిల్‌కి పడుతోంది కాబట్టి కార్ కిల్లర్ అనే పేరును ఖరారు చేశాట్ట దీని రూపకర్త క్రెగ్ కాల్ఫీ. పెడల్స్ ఉన్నా మోటార్ సాయంతో నడుస్తుంది. కావాలనుకుంటే పెడల్స్‌కూ పనిచెప్పొచ్చు. ఎల్‌ఇడి హెడ్‌లైట్లూ, టెయిల్ లైటూ, బ్రేకులు వంటి మామూలు సైకిళ్లకుండే అన్ని హంగులూ దీనికీ ఉన్నాయి. వెనకాల అటూ ఇటూ ఉండే బాక్సుల్లో కావలసినన్ని వస్తువులు తీసుకెళ్ళొచ్చు. వెదురుతో చేసిందే కదా ధర తక్కువే ఉండొచ్చని అనుకుంటున్నారు కదూ? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. దీని ధర ఎనిమిది వేల డాలర్లట. భారతీయ కరెన్సీలో దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు!