యువ

లక్ష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసుకున్నవాడికి చేసుకున్నంత.. కష్టాన్ని బట్టే ఫలితం. ఆ ఫలితాన్ని బట్టే రాణింపు. ఎవరికైనా 24గంటలే సమయం. క్షణమో యుగం కాకూడదు. 24గంటలూ సరిపోవన్నట్టుగా లక్ష్యాల బాటను వేసుకోవాలి. అహరహం శ్రమిస్తూ కొత్త మైలురాళ్లను అధిగమిస్తూ ఆశల సౌధాలను అందుకోవాలి. ఇదే విజయ పధం..విజేతల విజయరహస్యం.
అసలు నాయకత్వం అంటే ఏమిటి? నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? నిత్య జీవితంలో కొందరు వ్యక్తులే అత్యున్నత శిఖరాలు ఎందుకు అందుకోగలుగుతున్నారు..ఇంకొందరి ఆశలు అడియాసలుగా, ఎందుకూ కొరగాని ప్రయత్నాలుగా ఎందుకు మిగిలిపోతున్నాయి? ఇవన్నీ మన కళ్ల ముందే ఎదిగిన వ్యక్తుల్ని చూసి ఎవరికివారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ప్రశ్నలు. వీటి మూలాల్ని శోధిస్తే..ఆ కొందరు వ్యక్తుల ఎదుగుదల వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తే..మన విజయ పథాన్ని మనమూ నిర్దేశించుకోవచ్చు. మన గురించి మనం తెలుసుకోవడం కంటే జీవితంలో..అదీ పిన్న వయసులోనే వేగంగా విజయసౌధాన్ని అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం ముఖ్యం. మన లోపాలు, వైఫల్యాలూ, తప్పటడుగులు, నిరాశానిస్పృహలు ఇలా మనల్ని వెనక్కి లాగేసే ప్రతికూల ధోరణులను సరిదిద్దుకోగలిగిదే..
ఎవరికైనా 24గంటలే!
ప్రపంచంలో ఎవరికైనా ఉండే సమయం ఒక రోజులో 24గంటలే! అది నరేంద్ర మోదీ కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు.. బిల్ గేట్సూ కావచ్చు.. చివరికి భారత రాష్టప్రతికీ ఉండేది 24గంటలే.. సెకన్లు,

నిముషాలు, గంటలు ఇలా ప్రతి క్షణం అవకాశాల్ని అందించే రోజుల్ని చూస్తూ కూర్చుండి పోతే.. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. ఎక్కడున్నవాళ్లం అక్కడే ఉండిపోతాం. అందరికీ సమయం విలువ ఒకటే. కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలాగే ఉపయోగపడుతుంది. అలాగే సమయం కూడా.

కొందరికి క్షణమో యుగంలా గడుస్తుంది. ఇంకొందరికి రోజులో 24గంటలూ సరిపోవు. అంటే కాలం వేగంతో పరుగులు పెట్టే వారికి సమయం విలువ తెలుస్తుంది. కాలాన్ని దాటవేసే వారికి ఎన్ని గంటలు ఉన్నా..అవి ఎంత విలువైనవైనా ఏ మాత్రం పట్టదు. విజయరహస్యం ఇక్కడే ఉంది. కాలం విలువ తెలుసుకుని, సమయపాలన పాటిస్తూ.. నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాలను సాధించుకునే మార్గాలనూ నిర్దేశించుకుంటూ ముందుకు పోతే విజయం దానంతట అదే వరిస్తుంది. మన కళ్ల ముందు ఎదిగిన వాళ్లను చూసి మనం ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. వారూ ఈర్ష్య పడేలా ప్రతి ఒక్కరూ ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.
శ్రమ, క్రమశిక్షణ
ఈ రెండూ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైనవి. వారి ఎదుగుదలకు సంబంధించిన ప్రతి అడుగులోనూ ప్రస్ఫుటమయ్యే వ్యక్తిత్వ లక్షణాలు. ఎలాంటి విజయానికైనా దగ్గరిదారులుండవు. పడాల్సినంత కష్టపడితే గానీ, శ్రమించాల్సినంతగా శ్రమిస్తే గానీ..అన్నింటినీ మించి ఆగాల్సినన్ని రోజులు ఆగితే గానీ ఫలితం సిద్ధించదు. రాత్రికి రాత్రే విజేతలైన వారెవరూ ఉండరు. ఒక వేళ అడ్డదారుల్లో వక్రమార్గాల్లో అందలాలు ఎక్కినా ఆ విజయం, ఆ ఆనందం బుద్బుదప్రాయమే అవుతుంది. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి కేవలం శ్రమించినంత మాత్రాన సరిపోదు. క్రమశిక్షణ, సమయపాలనా ఎంతో అవసరం.
ఆత్మ విశ్వాసం
ప్రతి ఒక్కరికీ ఇది అత్యంత అవసరమైన లక్షణం. మన మీద మనకే నమ్మకం లేకపోతే ఇతరులను నమ్మించే లేదా మన ప్రతిభ పట్ల నమ్మకం కలిగించే పరిస్థితి ఉండదు. ఆత్మ విశ్వాసంతో ఎలాంటి లక్ష్యాన్నయినా సాధించవచ్చు. ఇదే లక్ష్యసాధన మార్గాలకు బలమైన పునాది అవుతుంది. ఈ పునాది ఎంత బలంగా, దృఢంగా, స్థిరంగా ఉంటే దానిపై కెరీర్‌కు సంబంధించిన ఎన్ని సౌధాలనైనా నిర్మించుకోవచ్చు. అందుకే ఆత్మవిశ్వాసమనే ముడిసరుకును ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అడుగడుగునా అవరోధాలు ఎదురైనా కూడా వాటిని మొక్కవోని ఆత్మ విశ్వాసంతోనే అధిగమించవచ్చు.
ప్రతికూలమూ..అనుకూలమే!
అన్ని మనకు అనుకూలంగా ఉండవు. అలాగే అన్నీ ప్రతికూలమూ కాదు. అనుకూల ప్రతికూల పరిస్థితుల మధ్య సమతూకాన్ని సాధించగలిగితే డీలా పడిపోవాల్సిన అవసరం ఉండదు. చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా, చివరికి గ్రూపు లీడర్‌గా ఎదగాలన్నా, నాయకుడు కావాలన్నా కూడా ఈ రకమైన సమతూకంతో కూడిన మనస్తత్వం అన్నది ఎంతైనా అవసరం. పరిస్థితులకు మనకు ప్రతికూలనైనప్పుడు వాటికి అనుగుణంగా మనల్నిమనం తీర్చిదిద్దుకోవడం ఎంతైనా అవసరం. లేక పోతే ఎదుగుదలకు అత్యంత వౌలికమైన లక్షణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మ విశ్వాసం బలంగా ఉంటే అది కెరీర్‌కు పునాది అవుతుంది. దానికి సమయపాలన తోడైతే లక్ష్యం చేరువవుతుంది. ఆ లక్ష్య సాధన ప్రయత్నాలు నిబద్ధత, నిరంతర కృషితో పదునెక్కితే..నేతలుగానే కాదు విజేయలుగానూ అన్ని రంగాల్లో రాణించవచ్చు.

-బి.సుధ