యువ

వర్షంలో హర్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం కురుస్తుంటే గొడుగేసుకుని వెళ్లడం బాగానే ఉంటుంది. కానీ ఈ గొడుగులతోనూ సమస్యలు లేకపోలేదు. ఒకటి- అకస్మాత్తుగా వర్షం పడితే చేతిలో గొడుగు లేకపోవడం. రెండు- ఎక్కడ పడితే అక్కడ మరచిపోయే వీలు ఉండటం. మూడు- గాలి ఉధృతంగా వీస్తే గొడుగు వంగి పోవడం. ఇంగ్లీష్‌లో గొడుగును అంబ్రెల్లా అంటారని తెలిసిందే. అయితే ఈ మూడు సమస్యలనూ తట్టుకునే విధంగా కొత్త గొడుగొకటి మార్కెట్లోకి రాబోతోంది. దీని పేరు ఊంబ్రెల్లా! ఈ గొడుగు హ్యాండిల్‌లో సెన్సర్లను అమర్చారు. వీటిని ఓ యాప్‌తో అనుసంధానించారు. వాతావరణంలోని మార్పులను సెన్సర్లు గ్రహించి యాప్‌కు చేరవేస్తాయి. ఒకవేళ వర్షం వచ్చేటట్టుంటే 15 నిమిషాల ముందే యాప్ హెచ్చరికలు జారీ చేస్తుందన్నమాట. కాబట్టి గొడుగును తీసుకెళ్తాం. ఎక్కడైనా దీన్ని మరచిపోయినా వెంటనే యాప్ హెచ్చరిస్తుంది. వర్షంలో ఉన్నప్పుడు సాధారణంగా సెల్‌ఫోన్ తడవకుండా ఉండేందుకు ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకుంటాం. ఆ సమయంలో ఎవరైనా కాల్ చేసినా రింగ్ టోన్ వినిపించదు. ఈ సమస్యకు పరిష్కారంగా గొడుగు హ్యాండిల్‌లోనే ఓ బజ్జర్ ఉంటుంది. సెల్‌కు ఇన్‌కమింగ్ కాల్ వస్తే ఈ బజ్జర్ మోగుతుందన్నమాట. ఊంబ్రెల్లా ఫ్రేమ్‌ను పటిష్టంగా రూపొందించడం వల్ల పెనుగాలులకు కూడా ఇది తట్టుకుని నిలబడుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి రానున్న ఊంబ్రెల్లా ధర 59 డాలర్లట! *