యువ

చేతికి కట్టుకుంటే పోలా? స్మార్ట్ఫోన్‌కు ఓ మాగ్నటిక్ కేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక చేత్తో ఓ పని చేస్తూ, మరో చేత్తో స్మార్ట్ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎవరికైనా కష్టమే. కాదని చేస్తే, స్మార్ట్ఫోన్ కిందపడి పగలడమో లేదా స్క్రాచ్‌లు పడటమో ఖాయం. ఈ సంగతి చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఉదయమే జాగింగ్ చేసేవారికి స్మార్ట్ఫోన్‌ను తీసుకువెళ్లే అవకాశమే ఉండదు. జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేసేవారి విషయంలోనూ అంతే. సైకిళ్లూ, మోటార్ సైకిళ్లూ నడిపేవారు స్మార్ట్ఫోన్ వాడకం నిషేధమే కానీ కొన్ని దేశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాడొచ్చు. అలాంటివారికి కూడా స్మార్ట్ఫోన్ వాడకం ఓ సవాలే. ఈ అవస్థలన్నీ గమనించిన క్లీవ్‌లాండ్‌కు చెందిన సెల్ఫీ- జడ్ అనే సంస్థ ఓ చక్కటి తరుణోపాయం కనిపెట్టింది. ఈ సంస్థ త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న మాగ్నటిక్ కేస్ కమ్ ఆర్మ్‌బ్యాండ్‌ను కొనుక్కుంటే సెల్‌ను ఆపరేట్ చేయడం తేలికే. ఆర్మ్‌బ్యాండ్‌ను చేతికి కట్టుకుని స్మార్ట్ఫోన్‌ను దానికి తగిలిస్తే సరి. సెల్ పడిపోదు సరికదా మీరు హాయిగా వేరే పని చేసుకుంటూ కూడా స్మార్ట్ఫోన్‌లో మాట్లాడొచ్చు. అలాగే ఈ మాగ్నటిక్ కేస్‌కు మెటల్ వస్తువులకు అతుక్కునే గుణం ఉంటుంది కాబట్టి, మీరు జిమ్‌కి వెళ్లి ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు దగ్గర్లోని ఓ మెటల్ వస్తువుకు ఈ కేస్‌ను తగిలించి, స్మార్ట్ఫోన్‌ను దానికి అమరిస్తే సరి.