యువ

స్మార్ట్ఫోన్ కాదు...గన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిపోతున్న గన్ కల్చర్‌తో తలలు పట్టుకుంటున్న అమెరికా పోలీసులకు మరో కొత్త బెడద ముంచుకొచ్చింది. ఐడియల్ కన్సీల్ అనే ఆయుధాల తయారీ సంస్థ ఓ కొత్తరకం పిస్టల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. అచ్చం సెల్‌ఫోన్‌లా ఉండే ఈ టూషాట్ పిస్టల్ ఏ కోణంలోంచి చూసినా గన్‌లా అనిపించదు. ‘హ్యాండ్ గన్స్‌ను దగ్గర ఉంచుకునే యువతలో మారిన అభిరుచులకు అనుగుణంగా ఈ గన్‌ను రూపొందించామ’ని కంపెనీ చెబుతోంది. కానీ దీనివల్ల మరెన్ని అనర్థాలు వస్తాయోనని పోలీసులు భయపడుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. కాబట్టి ఎవరిదగ్గర స్మార్ట్ఫోన్ ఉందో, ఎవరిదగ్గర గన్ ఉందో ఇకపై పసిగట్టడం కష్టమేనంటున్నారు. మరోవైపు తాము ఈ గన్‌ను తయారుచేసింది క్రిమినల్స్‌ను ప్రోత్సహించేందుకు కాదంటున్నారు ఐడియల్ కన్సీల్ సిఇఓ కిర్క్ జెల్‌బెర్గ్. అమెరికన్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ గన్‌ను తయారు చేస్తున్నామని, దీని ప్రోటోటైప్ జూన్‌లో విడుదల అవుతుందని, మార్కెట్లోకి అక్టోబర్‌లో వస్తుందని ఆయన చెప్పారు. తమ గన్ పట్ల చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారని, ఇప్పటికే నాలుగు వేల మంది ఈ కొత్తరకం గన్ కావాలంటూ తమకు ఇమెయిల్స్ పంపారని ఆయన చెప్పారు. *