యువ

కుంగుబాటుకు దగ్గరదారి సోషల్ మీడియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషల్ మీడియా ఓ పెద్ద వ్యసనమైపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సైట్లతో గంటల తరబడి గడిపేస్తున్న కుర్రకారు నెమ్మదిగా సమాజంలోని బంధాలు, అనుబంధాలకు
దూరమవుతున్నారు. ఆన్‌లైన్‌లోనే తప్ప
ప్రత్యక్షంగా స్నేహితులతో గడిపే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది అద్దానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తీవ్రమైన మానసిక రుగ్మతలకు
లోనవుతున్నారు. కొంతమంది కుంగుబాటు
(డిప్రెషన్)కు లోనవుతుంటే మరికొందరు
సానుకూల దృక్పథాన్ని కోల్పోతున్నారు.
ఇంకొందరు ఆత్మన్యూనతతో
సతమతమవుతున్నారు.
---
సోషల్ మీడియాలో మీ స్నేహితులు చేస్తున్న పోస్టింగులు చూసి మీరు అసూయ పడుతున్నారా? అంతా తమ సక్సెస్‌ల గురించి పోస్టింగులు పెడుతుంటే నేనేం చేయలేకపోతున్నానని దిగులు పడుతున్నారా? అప్పుడప్పుడు మాత్రమే అలా అనిపిస్తూ ఉంటే ఫర్లేదు. ఎప్పుడూ అదే ఆలోచనల్లో కుంగిపోతుంటే మాత్రం మీరు తక్షణం మానసిక వైద్య నిపుణుణ్ని సంప్రదించాల్సిందే.
--
స్నేహితుల పోస్టింగ్స్‌తో
కుంగుబాటు
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తమ స్టేటస్‌ను అప్‌డేట్ చేసేవారిలో చాలామంది వాస్తవానికి ఒంటరితనంతో బాధపడుతున్నవారే ఉంటారని సైకాలజిస్టులు చెబుతుంటారు. భౌతికంగా ఎవరినీ కలవక్కర్లేకుండా పరోక్షంగా వందలమందికి దగ్గరయ్యే మార్గం కాబట్టి వారెక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడుతూ ఉంటారు. ‘సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టింగ్స్ పెట్టేవారిని చూసి చాలామంది జెలసీ ఫీలవుతుంటారు. తాము అలా చేయలేకపోతున్నామే అనే ఒత్తిడి కూడా వారిపై ఎక్కువగా ఉంటుంది. అంతా బాగానే ఉన్నారు. నా పరిస్థితే ఏం బాగోలేదు అనే స్థితికి చేరతారు. ఇది క్రమంగా కుంగుబాటుకు దారితీస్తుంది.
-డాక్టర్ మిన్హాజ్ నసీరాబాది
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,
అపోలో హాస్పిటల్స్

అతి సర్వత్ర వర్జయేత్!
ఆన్‌లైన్‌లో ఏం జరుగుతోందోనన్న మితిమీరిన ఉత్సుకత కొంతమంది యువతీయువకుల్ని పెడదారి పట్టిస్తోంది. సోషల్ మీడియా సైట్ల వినియోగం 2005లో ఏడు శాతంగా ఉంటే , 2015నాటికి 65శాతానికి పెరిగింది. ఇలా ఎక్కువగా సోషల్ మీడియా సైట్లలోకి వెడుతున్నది 18నుంచి 29 ఏళ్ల మధ్య యువతీ యువకులే కావడం విశేషం. సోషల్ మీడియా సైట్లను యధాలాపంగా చెక్ చేస్తున్నవారితో పోలిస్తే రోజంతా ఇదే పనిలో ఉన్నవారు డిప్రెషన్ బారిన పడే అవకాశం 2.7 రెట్లు ఎక్కువని వివిధ అధ్యయనాల్లో తేలింది.
- డాక్టర్ కె.శ్రీనివాస్
కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్

ఆన్‌లైన్ - నిజజీవితం
‘సోషల్ మీడియాకు అలవాటు పడినవారిలో విభిన్న మనస్తత్వాలు గోచరిస్తాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివాటిలో బాగా యాక్టివ్‌గా ఉన్నవారు నిజజీవితంలో మందకొడి జీవన విధానం గలవారై ఉంటారు. సాధారణంగా వీరి ఆరోగ్యం కూడా అంత బాగుండదు. ఎవరినైనా ముఖాముఖీ కలిసినప్పుడు లేదా వారిని ఏదైనా విషయమై ఒప్పించాల్సినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. మొదట సరదాగా మొదలయ్యే సోషల్ మీడియా అలవాటు, ఆ తర్వాత వ్యసనంగా మారుతుంది. సైక్రియాటిస్టుల వద్దకు వచ్చే కేసుల్లో అధిక భాగం ఇవే. సోషల్ మీడియావల్ల కలుగుతున్న అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది.
-డాక్టర్ అఫ్తాబ్ అలీ ఖాన్
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, గ్లోబల్ హాస్పిటల్స్