యువ

ఈ పెన్సిల్‌ను నాటితే మొక్కవుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు కరవయ్యాయి. ఓజోన్ పొర నానాటికీ విచ్ఛిన్నమవుతోంది. ఈ అనర్థాలన్నింటికీ పరిష్కారం మొక్కలు నాటడం. చెట్లను పెంచడం. పచ్చదనం వెల్లివిరిస్తే సగానికి సగం సమస్యలు వాటికవే తొలగిపోతాయి. కానీ దీనికోసం నడుం బిగించేదెవరు? ఎవరికివారు పూనుకుంటే తప్ప ప్రభుత్వాల వల్ల ఇది కాని పని. అయితే ఈ దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలంటే వినూత్నమైన ఆలోచనలు కలగాలి. ఆసక్తికరమైన ఆవిష్కరణలు వెలుగుచూడాలి. అవే ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. చైతన్యం రగిలిస్తాయి. ఇదే ఆలోచనతో ‘స్ప్రౌట్ వరల్డ్’ అనే అంకుర పరిశ్రమ ముందడుగేసింది. ఓ అద్భుతమైన ఆవిష్కరణతో మొక్కలు నాటేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తోంది. ఇంతకీ ఏమిటా ఆవిష్కరణ?
స్ప్రౌట్ వరల్డ్’ పెన్సిళ్లను తయారు చేస్తోంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? సాధారణంగా పెన్సిళ్లను పూర్తిగా వాడేశాక ఏం చేస్తాం? పారేస్తాం. కానీ స్ప్రౌట్ వరల్డ్ తయారు చేసిన పెన్సిళ్లతో పని పూర్తయ్యాక నేలలో పాతితే, మొక్కవుతుంది! అదే ఇందులో వింత మరి!
‘ఒక్కొక్కరుగా మనం ఈ భూ గ్రహాన్ని కాలుష్యం బారినుంచి కాపాడలేకపోవచ్చు. కానీ చిన్న చిన్న ఆవిష్కరణల ద్వారా ప్రజల దైనందిన జీవన విధానంలో మార్పు తీసుకురావచ్చు. వారిలో స్ఫూర్తిని నింపొచ్చు. ఇదే ఆలోచనతో మేం స్ప్రౌట్ పెన్సిల్స్‌ను రూపొందించాం. ఇప్పుడిప్పుడే మా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది’ అన్నారు మైకేల్ స్టాషోమ్. ఆయన స్ప్రౌట్ వరల్డ్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
ఇంతకీ...పెన్సిళ్లను నాటితే మొక్కలు ఎలా వస్తాయో చెప్పనే లేదు కదూ! సాధారణంగా పెన్సిళ్ల చివరిభాగంలో ఎరేజర్ ఉంటుంది కదా. ఈ ఎరేజర్ స్థానంలో స్ప్రౌట్ కాప్యూల్‌ను ఏర్పాటు చేసింది. అంటే అందులో విత్తనం ఉంటుందన్నమాట. పెన్సిల్‌ను పూర్తిగా వాడేశాక చివరి భాగాన్ని నేలలో నాటి నీళ్లు పోస్తే మూడు వారాల్లోగా మొక్క మొలుస్తుంది. దట్సాల్! వాస్తవానికి ఈ ఐడియా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులది. వారి ఐడియాను స్ప్రౌట్ వరల్డ్ 2012లో కొనుగోలు చేసింది. గత ఏడాది స్ప్రౌట్ పెన్సిళ్ళ అమ్మకం ద్వారా 20 లక్షల డాలర్లు సంపాదించిందట! ఒక్క ఆలోచన కనక వర్షం కురిపించడమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికీ దోహద పడుతోంది కదూ! *