యువ

కోడ్ చాంపియన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదర్శ్ పుగాలియా, షాలిన్ షా - హైదరాబాద్ ఐఐటిలో చదువుతున్న ఈ కుర్రాళ్లూ ఒక్కసారిగా పత్రికలకెక్కారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ వాళ్లు సాధించిన ఘనత ఏమిటి?
టిసిఎస్ సంస్థ ఏటా గ్లోబల్ కోడింగ్ ఛాలెంజ్‌ను నిర్వహిస్తుంది. కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌కు సంబంధించిన ఈ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుర్రాళ్లు ఆసక్తి చూపిస్తారు. ఈసారి 3,708 కాలేజీలనుంచి 1,97,639మంది ఈ పోటీల్లో పాల్గొనేందుకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్లలో మనవాళ్లిద్దరూ కూడా ఉన్నారు. అందరూ దమ్మున్నవాళ్లే కావడంతో పోటీ హోరాహోరీ సాగింది. టాప్ 15 టీమ్స్ ఫైనల్‌కు చేరుకున్నాయి. వీటిలో మన దేశానికి చెందినవే 12 జట్లు ఉన్నాయి. పెరూకు చెందిన రెండు, స్లొవేకియాకు చెందిన జట్టు ఒకటి ఉన్నాయి.ఈ పోటీల గురించి ఆదర్శ్ మాట్లాడుతూ ‘చివరి 15 జట్లూ హోరాహోరీ తలపడ్డాయి. ఆ రోజు మాది. మేం గెలిచాం. మిగతా జట్లనూ కొట్టిపారేయలేం. అయితే మేం అదృష్టం వల్ల గెలిచామని మాత్రం చెప్పను. ఎందుకంటే షాలిన్, నేనూ ఎంతో హార్డ్ వర్క్ చేశాం’ అన్నాడు. సిఎస్‌ఇ స్పెషలైజేషన్‌తో సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న 21 ఏళ్ల ఆదర్శ్ చదువులో చిన్నప్పటినుంచీ ముందుండేవాడు. షాలిన్ అందుకుంటూ ‘ఫైనల్స్‌లో మొదటి మూడు గంటల్లోనే మేం మంచి లీడ్ సాధించాం. అయితే నాలుగో గంటలో మరో టీమ్ మమ్మల్ని దాదాపు అధిగమించే ప్రయత్నం చేసింది. దాంతో మాపై ఒత్తిడి పెరిగింది. చివర్లో టై అయింది. మా రెండు జట్ల మధ్యా టైమ్ గ్యాప్ కారణంగా మేం గెలిచాం’ అంటూ వివరించాడు. కోడ్ వైటా గెలుచుకోవడంతో 10వేల డాలర్ల ప్రైజ్‌మనీ వారి వశమైంది. ముంబయిలోని డిజె సంఘవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టీమ్ సెకండ్ ప్రైజ్ గెలుచుకోగా ప్రేగ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ చార్లెస్ జట్టు మూడో బహుమతి సాధించింది. ఆదర్శ్ త్వరలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలుపెట్టబోతున్నాడు. ముం దు చదువు పూర్తి చేశాకే ఉద్యోగం గురించి ఆలోచిస్తానంటున్నాడు షాలిన్. సో.. ప్రతిష్టాత్మకమైన కోడ్ వైటా గెలుచుకున్న ఆదర్శ్, షాలిన్‌లకు ‘యువ’ అభినందనలు తెలుపుతోంది.

చిత్రం ఆదర్శ్ పుగాలియా, షాలిన్ షా