యువ

అమ్మో.. అమ్మాయేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని ఆటలు మగవాళ్లకు మాత్రమే పరిమితమనే అపోహ చాలామందిలో
ఉంది. అందులో బాడీ బిల్డింగ్ ఒకటి. విదేశాల్లో ఆడ బాడీ బిల్డర్లు ఒకరో
ఇద్దరో కనిపించినా మన దేశంలో మచ్చుకు ఒకరు కూడా కనిపించరు.
ఒకవేళ అలాంటి స్పోర్ట్‌ను ఎంచుకున్నా, వారిని వింతగా చూడకమానరు. అలాంటిది ఓ అమ్మాయి బాడీ బిల్డింగ్‌ను ఎంచుకుని అందులో
అవార్డులు, రివార్డులు సాధించడమంటే మాటలా? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ముప్ఫయ్యేళ్ల దీపికా చౌదరి. మన దేశంనుంచి ప్రొఫెషనల్ బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ మహిళ ఆమె. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ (ఐఎఫ్‌బి)లో
ప్రో కార్డ్ సంపాదించిన మొదటి భారతీయ మహిళా దీపికే!

--

చాలామంది అమ్మాయిల్లా దీపికకు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలేమీ ఉండేవి కావు. బాగా చదువుకుని, ఉద్యోగం సంపాదించడం. ఆ తరువాత మంచి కుర్రాణ్ని చూసి పెళ్లి చేసుకోవడం. ఈ రెండు లక్ష్యాలనూ సాధించడం ఆమెకు కష్టమేమీ కాలేదు. చదువు పూర్తయిన వెంటనే పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉద్యోగం వచ్చింది. ఈలోగా పెళ్లి కూడా అయింది. ఇంట్లో పనులు చక్కబెట్టుకుని లాబ్‌కు పరుగెత్తడం, లాబ్‌నుంచి వచ్చీ రాగానే మళ్లీ ఇంటిపనుల్లో మునిగిపోవడం. అలాంటి తరుణంలో భర్త ఇచ్చిన ఓ సలహా, ఆ దిశగా అందించిన ప్రోత్సాహం దీపిక జీవితానే్న మార్చివేశాయి. అదెలా జరిగిందో ఆమె మాటల్లోనే...
ప్రోత్సాహం ఎవరిది?
బాడీ బిల్డింగ్ అంటే అర్థమేమిటో కూడా నాకు తెలీదు. అలాంటిది ఐదేళ్ల కిందట నా భర్త నన్ను బాడీ బిల్డింగ్ దిశగా ప్రోత్సహించారు. ఆయన మాట కాదనలేక జిమ్‌లోకి అడుగుపెట్టాను. నెమ్మది నెమ్మదిగా ఆసక్తి పెరిగింది. ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కావాలన్న పట్టుదలతో కఠోర శ్రమ చేశాను. నా ఫిట్‌నెస్ ట్రెయినర్ సలహాపై పుణెలో కె11 అకాడెమీలో చేరి ఫిట్‌నెస్ ట్రెయినర్ కోర్సు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సు పూర్తి చేశాను. అప్పుడే షేరూ క్లాసిక్ గురించి తెలిసింది. ఇండియాలో జరిగే ఏకైక బాడీ బిల్డింగ్ ఈవెంట్ అది. అందులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాను. అక్కడే నాకు షన్నాన్ డేతో పరిచయం అయింది. నన్ను ఓ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్‌గా మలచింది ఆమె.

దినచర్య
ఉదయం ఐదింటికి లేస్తాను. ఓ గంట వాకింగ్ చేశాక, ఇంటికొచ్చి ఆ రోజుకు నా ఫుడ్‌ను ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఉద్యోగానికి వెడతాను. సాయంత్రం ఐదున్నరకు లాబ్‌నుంచి బయటపడ్డాక నేరుగా జిమ్‌కు వెళ్లిపోతాను. రెండు గంటలపాటు రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేసి, తొమ్మిదింటికి ఇల్లు చేరుకుంటాను.
జిమ్‌లో వర్కవుట్లు
అరగంట సేపు వామప్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. తర్వాత శరీరంలోని ప్రతి అవయవాన్నీ దృష్టిలో ఉంచుకుని వర్కవుట్లు చేస్తాను. వారంలో రెండు రోజులు కేవలం కాళ్లకు సంబంధించిన వ్యాయామమే చేస్తాను. మిగిలిన నాలుగు రోజులూ భుజాలు, ఛాతీకి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. ఆదివారం మాత్రం సెలవు. ఆ రోజు జిమ్‌కు వెళ్లను.
డైట్ ఎలా ఉంటుంది?
రోజుకు ఏడుసార్లు భోజనం చేస్తాను. భోజనంలో అన్ని రకాల ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త పడతాను. అదీకాకుండా భోజనంలో ఎక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే, ఎంత ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే అంత ఎక్కువగా వాటిని ‘బర్న్’ చేసేందుకు వర్కవుట్లు చేయొచ్చు. సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, లంచ్‌లో కాయగూరల సూప్‌లు లేదా చికెన్ పులావ్ ఉంటాయి.
మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది?
కొంతమంది నన్ను మెచ్చుకుంటారు. నన్ను స్ఫూర్తిదాయకంగా మలచుకున్నామని చెప్పే మగవారే ఎక్కువ. మహిళలు కూడా బాడీ బిల్డింగ్‌లో నా ఉన్నతిని చూసి ప్రశంసిస్తారు. కానీ నాలా కావాలని అనుకోరు. ఎవరి అభిరుచి వారిది. దానికి వాళ్లని నేను తప్పుబట్టను.
అవార్డులు..రివార్డులు
గత ఏడాది అమెరికాలో జరిగిన స్టీవ్ స్టోన్ మెట్రోపాలిటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఓవరాల్ ఫిగర్ కేటగిరీలో దీపిక ఛాంపియన్‌గా ఎంపికైంది. అలాగే అమెరికాలోనే ఐఎఫ్‌బిబి, నేషనల్ ఫిజిక్ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ‘బ్యాటిల్ ఆన్ ది బీచ్’లో ఆమె రెండు అవార్డులు గెలుచుకుంది. ఇండియాలో జరిగిన అనేక ఈవెంట్లలోనూ ఎన్నో పతకాలు సాధించింది. *