యువ

దాహం తీర్చే టీ షర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు దాహం వేస్తూండవచ్చు. లేదా శరీరం డీహైడ్రేట్ అవుతూ ఉండొచ్చు. ఆ విషయం మీకు తెలియకపోయినా మీరు వేసుకున్న టీ షర్ట్‌కు తెలుస్తుంది. వెంటనే కాసిని మంచినీళ్లు తాగమని మిమ్మల్ని హెచ్చరిస్తుంది- ఇదంతా హాలీవుడ్ మూవీలో సీన్ అనుకుంటున్నారేమో? కానే కాదు. వేరబుల్ టెక్నాలజీలో వస్తున్న వినూత్న మార్పులకు నిదర్శనమిది. అసలు విషయానికొస్తే ఫిలడెల్ఫియా యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు వెరిజోన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ టీమ్‌తో కలసి ఓ టీ షర్ట్‌కు రూపకల్పన చేశారు. చూడటానికి సాదా సీదా టీ షర్ట్‌లానే కనిపించినా, ఇందులో అమర్చిన శక్తిమంతమైన సెన్సర్లు, ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతను, హార్ట్‌రేట్‌నూ ఓ కంట కనిపెడుతూ ఉంటాయి. శరీరంలో నీటి శాతాన్ని కూడా లెక్కగడుతూ ఉంటాయి. శరీరం డీహైడ్రేట్ అవుతుంటే వెంటనే మీ స్మార్ట్ఫోన్‌కు హెచ్చరికలు పంపుతాయి. ఎండలో తిరిగేవారికి, క్రీడాకారులకు ఈ టీ షర్ట్ చాలా ఉపయోగం.