యువ

సై అంటే సైదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు?
పేరు సైదా ఫలక్
ఊరు హైదరాబాద్
వయసు 21 ఏళ్లు

ఏం చదువుకుందో?
డిగ్రీ చేసింది.
ఎంఎ ఇంగ్లీష్ చదువుతోంది

అయితే ఏంటి గొప్ప?
గొప్పే మరి! అమెరికాలో జరిగిన యుఎస్‌ఎ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ ఫిమేల్ కుమైట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టేసింది. 42 దేశాలు పాల్గొన్న ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడమంటే మాటలు కాదు. ఈ టైటిల్ గెలిచిన మొట్టమొదటి తెలంగాణ మహిళ సైదానే!

ట్రైనింగ్ ఎక్కడ తీసుకుందో?
హైదరాబాద్‌లోనే. రోజుకి నాలుగునుంచి ఆరు గంటలు శిక్షణ తీసుకునేది. కరాటే, ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి సారించేది.

స్ఫూర్తినిచ్చింది ఎవరట?
ఆమె తండ్రే ఆమెకు స్ఫూర్తి. ఒక ఆడపిల్లమీద ఇంత ఖర్చు పెట్టడం ఎందుకని సైదా తండ్రిని అందరూ నిరుత్సాహపరచేవారట. కానీ, కూతురు పైకెదుగుతుందని, తన పేరు నిలబెడుతుందని ఆయనకు నమ్మకం. అందుకని ఎవరేమన్నా పట్టించుకోకుండా సైదాని ఓ కరాటే ఛాంపియన్‌ని చేశాడు. ఆమెని అభిమానులు ముద్దుగా ‘గోల్డెన్ గర్ల్ ఆఫ్ హైదరాబాద్’ అని పిలుచుకుంటారు.

ఇంతకీ సైదా ఏమంటోంది?
విజయానికి అడ్డదారుల్లేవన్న విషయాన్ని సైదా విశ్వసిస్తుంది. కష్టపడటమే తనకు తెలుసని, ఎప్పుడో ఒకప్పుడు అదే తనని విజయ శిఖరాలు అధిరోహింపచేస్తుందని ఆమె నమ్మకం. ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైందంటుంది సైదా. కాలేజీ చదువులకు, కరాటే శిక్షణకు సమయం కేటాయించడం ఇబ్బందిగానే ఉన్నా, ఈ రెండింటిలో ఏదీ వదులుకోనని చెబుతోంది.

ఇప్పటివరకూ ఎన్ని టైటిళ్లు గెలిచిందట?
13 ఇంటర్నేషనల్ టైటిళ్లూ, 18 నేషనల్ ఛాంపియన్‌షిప్స్ సైదా గెలుచుకుంది.

ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటట?
ఆగస్టులో జరిగే ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లోనూ, ఆస్ట్రియాలో అక్టోబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొనబోతోంది.
*