యువ

టెక్నాలజీతో చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దైనందిన జీవితంలో టెక్నాలజీ ఓ భాగమై పోయింది. ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలు డెస్క్‌టాప్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేయడం వరకూ, కంప్యూటర్ లేనిదే క్షణం గడిచే పరిస్థితి లేని దశకు చేరుకున్నాం. స్మార్ట్ఫోన్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిశీలిస్తే, మింగుడుపడని నిజాలెన్నో కనిపిస్తాయి. మెడనొప్పి, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలతోపాటు స్లీప్ డిజార్డర్, రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్, వెనె్నముక సంబంధిత వ్యాధులు వంటి వాటి బారిన పడుతున్నట్టు అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి.

--

ఇటీవలి ఓ అధ్యయనంలో తేలిన నిజాలు
* మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడుతూ
వివిధ వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది
* తరచూ ఉద్రేకానికి గురి కావడం, కుంగుబాటుకు లోనవడంవంటి వాటికి లోనవుతున్నారు.
* చాలా త్వరగా అలసిపోతున్నారు
* వినికిడి శక్తి లోపించడం, ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు.
***
* ఐటి రంగంలో పనిచేస్తున్నవారిలో 59శాతం మంది తాము తరచూ ఒత్తిడికి లోనవుతున్నట్టు చెప్పారు.
* ఐటి రంగ నిపుణుల్లో చాలామంది మెడ నొప్పితో బాధపడుతున్నారు. వీరిలో 39 శాతం మంది తాము గతంలో ఇదే సమస్యతో బాధపడినట్టు చెప్పారు.
* సాధారణంగా 35-45 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఇలాంటి బాధలతో సతమతమవుతున్నారు.

తలనొప్పి సర్వసాధారణం
స్మార్ట్ఫోన్లనుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు రేడియో ధార్మిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని మన శరీరం శోషించుకుంటుంది. ఈ కారణంగా తలనొప్పులు, ఒంటినొప్పులకు గురవుతాం.
రేడియో ధార్మికత మన చర్మంపైనా, మృదు కణజాలంపైనా ప్రభావం చూపుతుంది. చాలామందికి చర్మంపై దద్దుర్లు రావడానికి కారణం ఇదే. అలాగే ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లో మాట్లాడేవారి చెవులు దెబ్బతింటాయి. చెవి కండరాలు పాడవుతాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు మెడను ఓపక్కకు వంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మెడ కండరాలు కూడా దెబ్బతింటాయి. ఇవన్నీ తలనొప్పికీ దారితీస్తాయి.
- డాక్టర్ జె అనీష్ ఆనంద్
కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, అపోలో హాస్పిటల్స్

కూర్చునే భంగిమ సరిగా ఉండాలి
గతంలో ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, దుస్తులు తయారు చేసేవాళ్లు వంటివారు మాత్రమే నడము నొప్పి, మెడనొప్పితో బాధపడేవారు. ఇప్పుడు ఈ జాబితాలో డెస్క్‌టాప్‌పై పనిచేసేవారు కూడా చేరిపోయారు. గంటల తరబడి కూర్చుని పనిచేయడమే కాదు, సరైన భంగిమలో కూర్చోకపోవడం దీనికి కారణం. మోచేతులు, మణికట్టు, చేతులు, మెడ, భుజాల నొప్పులతో వీరు సతమతమవుతున్నారు. విటమిన్ డి లోపం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. రోజుకు ఎనిమిదినుంచి తొమ్మిది గంటల సేపు ఒకే భంగిమలో కూర్చుని పనిచేయడంవల్ల నడుం కిందిభాగంలో వెనె్నముక దెబ్బతింటోంది. ప్రతి 20 నిమిషాలకూ ఒకసారి సీట్లోంచి లేచి, కాస్త అటూ ఇటూ తిరిగి రావడమనేది ఈ సమస్యకు ఓ పరిష్కారం. అలాగే రెం డు గంటలకోసారి కాసే పు స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం కూడా సత్ఫలితాలనిస్తుంది.
- డాక్టర్ సుధీంద్ర వి.
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్
రిహాబిలిటేషన్, కిమ్స్