ప్రకాశం

రోజా సస్పెన్షన్, కాల్‌మనీ వ్యవహరంపై సిబిఐ విచారణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీ సమావేశం పార్టీ సమావేశంలా మారింది
అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేస్తాం
ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి
ఒంగోలు,డిసెంబర్ 25: తమ పార్టీకి చెందిన శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్, కాల్‌మనీ వ్యవహరంపై సిబిఐ విచారణ చేపట్టాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఈ రెండువిషయాలపై సిబిఐ, జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని కోరారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా అసెంబ్లీ సమావేశంలో తెలుగుదేశంపార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రవర్తించారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన రోజా వ్యాఖ్యలను సమర్థించమని, అలాగని ప్రతిపక్షనాయకులు ఏం మాట్లాడారో తెలుసుకోవాల్సిన ఉందన్నారు.అసెంబ్లీ పరిస్థితి బాగాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు పార్టీసభలా తయారైందని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎవరెవరు మాట్లాడారో రికార్డులను బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వచ్చేసంవత్సరంలో సాధించి తీరుతామని ఎంపి వైవి స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదుసంవత్సరాలుకాదు పదిసంవత్సరాలు ఇస్తామని బిజెపినేతలు ప్రకటించారని కాని తీరా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత స్పందనలేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేకహోదావిషయంలో రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేకాంద్రాహక్కు ఇటీవల తమఅధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన కార్యక్రమం చేపట్టారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్ధితి ఆధ్వాన్నంగా తయారైందన్నారు. పొగాకు, పత్తి రైతులకు తమప్రభుత్వాలు అధికారంలోకివస్తే గిట్టుబాటు ధరలను కల్పిస్తామని బిజెపి, తెలుగుదేశంపార్టీలు గొప్పలు చెప్పాయని కాని ఆచరణలో మాత్రం జరగటం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదికప్రకారం రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఆ రెండుపార్టీలు ప్రకటించాయన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గిట్టుబాటుధరలు రాక 25సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా 18మందిరైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పత్తిరైతులకు మహారాష్ట్రప్రభుత్వం ఆదుకునేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకాశం, గుంటూరు జిల్లాలోని మిర్చిరైతులు తీవ్రంగా నష్టపోయారని అందువలన ఆ రైతులను ఆదుకునేందుకు ఎన్యూమరేషన్‌చేసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
తమప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఇంటికో ఉద్యోగాన్ని పీకేస్తున్నారని ధ్వజమెత్తారు. అంగన్‌వాడీలు న్యాయపరంగా ఆందోళన చేస్తే ఒక కలంపోటుతో 14వేలమంది అంగన్‌వాడీలను తీసివేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంగన్‌వాడీలను తొలగిస్తు జారీచేసిన జీవోను వెంటనే రద్దుచేయాలని, లేని పక్షంలో తమపార్టీ అంగన్‌వాడీల పక్షాన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గోకుల్ గ్రామయోజన పథకాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రవ్యవసాయశాఖమంత్రి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందన్నారు. తమప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒంగోలు పశుసంపదను కాపాడ్తామని బిజెపి ప్రకటించిందని అందువలన జిల్లాలో ఈపధకం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని రామాయపట్నం వద్ద అటామిక్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని , అందులో భాగంగా పబ్లిక్ హియరింగ్ పెట్టాలని ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ అటామిక్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు, ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన తెలిపారు. జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో పది వేల నుండి 12 వేలమంది వరకు ఎక్స్ సర్వీస్ మెన్‌లు ఉన్నారని, వారికి గిద్దలూరులో మరో 20 రోజుల్లో క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు చేయడం వలన 25 వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిడిపి ప్రకారం ప్రకాశం జిల్లా వెనుకబడి ఉందని, అందువలన జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా స్పందన రాలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించే అమరావతి రాజధాని తక్షణ అవసరాలను ఏర్పాటు చేయకుండా 2030వ సంవత్సరానికి కొత్త రాష్ట్రం ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందంటూ ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పై ఎన్విరాన్‌మెంట్ స్టడీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల చైనె్నలో 15 నుండి 20 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే చైనె్న నగరం ఏ విధంగా తయారు అయ్యిందో చూశామని, అలాగే కొండవీటి వాగు పొంగి పొర్లితే ప్రస్తుతం అక్కడ ఉన్న మాగాణి భూములన్నీ ముంపునకు గురి అవుతాయని, దీంతో ఎన్విరాన్‌మెంట్ స్టడీ చేయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైకాపా రాష్ట్ర, జిల్లా నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి రమణారెడ్డి, వైవి వెంకటేశ్వర్లు, వరికూటి అశోక్‌బాబు, వేమూరి సూర్య (బుజ్జి) తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.