జాతీయ వార్తలు

మరణించిన ఓటర్ల పేర్లు ‘ఆటోమేటిక్’గా తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జనన మరణ రిజిస్ట్రార్ సర్వర్‌తో అనుసంధానం
* ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడి
అమృతసర్, డిసెంబర్ 29:మరణించిన ఓటర్ల వివరాలను ఆటోమెటిక్‌గా జాబితా నుంచి తొలగించే విధంగా ఓ జాతీయ స్థాయి వ్యవస్థను రూపొందిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలోని ప్రతి జిల్లాలో ఉండే జనన మరణాల రిజిస్ట్రార్ సర్వెర్‌కు అనుసంధానం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని, దీని వల్ల మరణించిన ఓటర్ల వివరాలను జాబితా నుంచి అప్పటికప్పుడే తొలగించేందుకు వీలుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ మంగళవారంనాడిక్కడ వెల్లడించారు. చెల్లని అలాగే డూప్లికేట్ ఓటర్ల జాడ్యాన్ని తొలగించేందుకు వీలుగా ఈ కొత్త కార్యక్రమాన్ని పంజాబ్ నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. మరణించిన ఓటరు పేరును జాబితా నుంచి తొలగించేందుకు అతడు లేదా ఆమె కుటుంబం అందించే సమాచారంపై ఆధార పడటం వల్ల ప్రయోజనం ఉండదని, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి అప్పటికప్పుడే తొలగించే పటిష్టమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని జైదీ తెలిపారు.