మహబూబ్‌నగర్

తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్
ఇటిక్యాల, మార్చి 15: వేసవికాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోపల్‌దినె్న గ్రామంలో గ్రామపంచాయతి భవనం, పాఠశాల అదనపు గదుల కోసం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, అలంపూర్ ఎమ్మెల్యే ఎస్‌ఎ సంపత్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ఉపాధిహామి నిధుల నుంచి రూ.13లక్షలు గ్రామపంచాయతి భవనానికి, రాజీవ్ విద్యామిషన్ నిధుల నుంచి రూ.6.5లక్షలతో అదనపు గది నిర్మాణం చేపడుతున్నామన్నారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. అదేవిధంగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో పాలమూరుకు ప్రత్యేక శ్రద్దవహించి రూ.7వేల కోట్ల నిధులు మంజూరు చేయడం ఎంతో హర్షనీయమన్నారు. కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, ఎంపిటిసి సురేఖ, మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు రాందేవ్‌రెడ్డి, నీలంకృష్ణ, నాగబలిమి తదితరులు ఉన్నారు.