S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/17/2019 - 04:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ) ఖాతాదారులకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. పీఎంసీలో 4,355 కోట్ల రూపాయల కుంభకోణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పీఎంసీపై రిజర్వ్ బ్యాంక్ విత్‌డ్రాలపై ఆంక్షలు పెట్టింది.

10/17/2019 - 01:49

ఖైరతాబాద్, అక్టోబర్ 16: నిమ్స్ ఆవరణలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆడ శిశువు జన్మించడంతో పేగు బందాన్ని సైతం కాదని శిశువును కవర్‌లో పెట్టి ఆసుపత్రి ఆవరణలో వదిలి వెళ్లిపోయారు. చెత్తకుప్పలో శిశువు ఏడుపును గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సజీవంగా ఉన్న ఆడ శిశువును గుర్తించారు. హుటాహుటిన నిమ్స్ ఎమర్జెన్సీకి తరలించి పాపకు చికిత్సలు అందజేశారు.

10/17/2019 - 01:35

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం బుధవారం నాడు హైకోర్టుకు సమర్పించింది. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అసంపూర్ణంగా ఉందని, కొత్త సచివాలయం ఎందుకు నిర్మించాలో సకారమైన కారణాలను పేర్కోలేదని హైకోర్టు పేర్కొం ది.

10/17/2019 - 01:33

హైదరాబాద్ : టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించగా, ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బతగిలింది. సెప్టెంబర్ నెల జీతా లు చెల్లించకపోవడంతో కార్మికులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరిగింది. జీతాలు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

10/17/2019 - 04:02

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో తీహార్ జైలులో జుడీషియల్ కస్డడీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతను ఈడీ అదుపులోకి తీసుకుంది. చిదంబరంపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. మాజీ ఆర్థిక మంత్రిని విచారించేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం ఈడీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

10/17/2019 - 01:19

వరదయ్యపాళెం, అక్టోబర్ 16: కల్క్భిగవాన్ ఆశ్రమం (ఏకం ఆధ్యాత్మిక కేంద్రం)పై బుధవారంనాడు తమిళనాడుకు సంబంధించిన నాలుగు బృందాలు ఐటీ దాడులు నిర్వహించారు.

10/17/2019 - 03:55

పోడూరు: ప్రేమోన్మాదం మరోసారి కట్టలు తెంచుకుంది... పెళ్లయ్యి, తండ్రి అవతారమెత్తి, నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి, రెచ్చిపోయాడు... రెండేళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడుతూ, పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక విద్యార్థినిని కళాశాలకు వెళుతున్న సమయంలో కత్తితో తెగనరికాడు... అడ్డుకోబోయిన మరో వ్యక్తినీ గాయపరిచాడు...

10/17/2019 - 01:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం అయోధ్య, రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై గత నలభై రోజుల నుండి కొనసాగుతున్న విచారణకు తెర దించి తీర్పును రిజర్వు చేసింది. వౌల్డింగ్ ఆఫ్ రిలీఫ్ కోసం మూడు రోజుల లోగా తమ వాదనలను రాతపూర్వకంగా అందజేయాలని వాద, ప్రతివాదులను గొగోయ్ ఆదేశించారు.

10/16/2019 - 05:39

జోగిపేట, అక్టోబర్ 15: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

10/16/2019 - 05:37

దేవరకొండ, అక్టోబర్ 15: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో ట్రాలీ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో 32 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామ సమీపం లోని ప్రధాన రహదారిపై మంగళవారం పత్తి కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో టైర్ పేలిపోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో 32 మంది గాయపడ్డారు.

Pages