S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/02/2020 - 05:15

హాలియా: కామంతో కళ్లు మూసుకుపోయ 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాలియా సీఐ జీ.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామానికి చెందిన వడ్డేగోని గోపమ్మ (90) అనే వృద్ధురాలు ఒంటరిగా మారేపల్లిలోని ఒక చిన్న ఇంట్లో ఉంటోంది. ఆమెకు ఐదుగురు కుమారులు ఉండగా నెలకు ఒకరి వద్ద ఉంటోంది.

03/02/2020 - 02:27

న్యూఢిల్లీ: నిర్భయ రేప్, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. దోషులు నలుగురి లో ఒకడైన పవన్‌గుప్తాను కూడా ఈనెల మూడో తేదీన ఉరితీయాల్సి ఉంది. ఉరికి ఒక్క రోజు ముందు పవన్‌గుప్తాకు న్యాయపరంగా మిగిలి ఉన్న ఏకైక అవకాశమైన క్యురేటివ్ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎన్‌వీ రమణ తన చాంబర్‌లో విచారిస్తారు.

03/02/2020 - 02:25

సింగ్రౌలి, మార్చి 1: మధ్య ప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో రెండు గూడ్సు రైళ్ళు ఎదురెదురుగా ‘ ఢీ’కొనడంతో ఇంజన్‌లో ముగ్గురు డ్రైవర్లు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

03/02/2020 - 01:19

కృత్తివెన్ను, మార్చి 1: మండల పరిధిలోని గుడిదిబ్బ పల్లెపాలెంలో ఓ వ్యక్తి దారణ హత్యకు గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అండ్రాజు వెంకటేశ్వరరావు(46) అదే గ్రామానికి చెందిన బొడ్డు సుశీలతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు.

03/02/2020 - 01:05

కీసర, మార్చి 1: మద్యం మత్తులో కారు నడిపి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కీసర అనుబంధ గ్రామమైన వనె్నగూడకు చెందిన రాయపురం కృష్ణ(48), మంత్రాల నర్సింహ(38) ద్విచక్ర వాహనంపై భోగారం గ్రామం నుంచి వనె్నగూడ వైపు వెళ్తున్నారు.

03/02/2020 - 00:31

గుంటూరు, మార్చి 1: గుంటూరు జిల్లాలో ఆదివారం అతివేగం రూపంలో మృత్యువు పలువురి ప్రాణాలను కబళించింది. అతివేగంగా వాహనాలు నడిపి అదుపు చేయలేక రోడ్డు ప్రమాదాలకు గురై కొందరు తమ కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టగా, మరికొందరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వట్టిచెరుకూరు, వెల్దుర్తి మండలాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు.

03/01/2020 - 05:41

కోల్‌కతా, ఫిబ్రవరి 29: భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విదేశీయులు పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం తప్పనిసరి కాదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, వారు తమ దేశ పాస్‌పోర్ట్‌ను ఎందుకు కలిగి లేరో తగిన కారణాలను తెలియజేయవలసి ఉంటుందని పేర్కొంది.

03/01/2020 - 05:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: నిర్భయ కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ కుమార్ గుప్తా ఉరిశిక్ష అమలు నిలిపేయాలంటూ ఢిల్లీను ఆశ్రయించారు. ఉరి అమలుపై స్టే కోరుతూ ముద్దాయిల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేశారు. నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో న్యాయస్థానం నలుగురు మృగాళ్లకు ఉరి శిక్ష వేసింది. వివిధ కారణాలతో ఇప్పటికే ఉరిశిక్ష అమలు రెండు సార్లు వాయిదా పడింది.

03/01/2020 - 05:05

నందివాడ, ఫిబ్రవరి 29: రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా మరోఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని జీపీకే రహదారిపై తమిరిశ వద్ద శనివారం జరిగింది. నందివాడ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ అనిల్ కథనం ప్రకారం పోలుకొండ నుండి గుడివాడ వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుడివాడ నుండి పోలుకొండ వైపువస్తున్న మరోద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

03/01/2020 - 05:02

చల్లపల్లి, ఫిబ్రవరి 29: ఆటో పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం స్థానిక నాగాయలంక రోడ్డులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త మాజేరు గ్రామానికి చెందిన తమ్ము బాల (72), కొక్కిలగడ్డ గంగమ్మ, లంకె లక్ష్మి, అనుగొంది తిరుపతమ్మ చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు.

Pages