S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/06/2019 - 01:41

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బంజారాహిల్స్ పోలీసులు శనివా రం అరెస్టు చేశారు. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ నుంచి నిబంధనలుకు విరుద్ధంగా రవిప్రకాష్ డబ్బు తీసుకున్నట్లు అలంద మీడి యా పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. గత రెండు మూడేళ్లలో దాదాపు రూ.100 కోట్లు అక్రమం గా తరలించినట్లు అలంద మీడియా ఫిర్యాదులో పేర్కొంటూ.. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించింది.

10/06/2019 - 00:43

హైదరాబాద్, అక్టోబర్ 5: సినీ నిర్మాత ప్రసాద్ వీ.పొట్లూరి (పీవీపీ) నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని మరో నిర్మాత బండ్ల గణేశ్ పోలీసులను ఆశ్రయించారు. పీవీపీ, ఆయన అనుచరులు తనకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని బంజారాహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోపక్క పీవీపీ శుక్రవారం రాత్రి గణేశ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10/06/2019 - 01:44

శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల బంగారం, 42 బంగారు బిస్కెట్లు రూపంలో ఉన్నట్లు గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ రూ.1.85కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

10/05/2019 - 23:24

షాజహాన్‌పూర్, అక్టోబర్ 5: అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద వాయిస్ శాంపిల్స్‌ను తీసుకునేందుకు సిట్‌కు స్థానిక కోర్టు అనుమతించింది.

10/05/2019 - 23:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఉన్నావో అత్యాచారం కేసులో ఓ న్యాయవాదిని ఢిల్లీ కోర్టు మందలించింది. బీజేపీ నుంచి సస్పెండైన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని విచారణాధికారులు తీసుకున్నారు. కాగా, ఈ కేసు విచారణకు ఎవర్నీ అనుమతించకూడదని ఢిల్లీ కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. ఆంతరంగికంగానే ప్రొసీడింగ్స్ ఉండాలని ఆదేశించింది.

10/05/2019 - 23:16

ముంబయి, అక్టోబర్ 5: ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్‌కు కోర్టు ఈనెల 12 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల విచారణ నిమిత్తం ఈనెల 17వరకు ఆయన వారి కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేసింది. 4,355 కోట్ల రూపాయల కుంభకోణంలో జాయ్ థామస్ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి.

10/05/2019 - 00:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నలుగురు అడ్వకేట్ల పదోన్నతికి సంబంధించి ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు కొలీజియం తిరస్కరించింది. వీరందరినీ కర్నాటక హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది.

10/05/2019 - 00:02

వరంగల్, అక్టోబర్ 4: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తలు అక్కడికక్కడే చనిపోగా, 12 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, అతని సమీప బంధువైన మరొకరు మొత్తం నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

10/05/2019 - 00:00

నల్లగొండ టౌన్, అక్టోబర్ 4: మద్యం మత్తులో కన్న తండ్రినే కొడుకు హత్య చేసిన దారుణ ఘటన నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు నాంపల్లి మండలంకు చెందిన పెరుమాళ్ల గోవర్ధన్ (60), కొడుకు పెరుమాళ్ల సతీశ్ (28)తో కలిసి కూలిపని చేసుకుంటు కొన్నాళ్లుగా పట్టణంలోని ప్రకాశం బజార్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

10/04/2019 - 23:59

నల్లగొండ, అక్టోబర్ 4: నల్లగొండ జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ పదవిలో కొనసాగేందుకు ఓ ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీతో నకిలీ సిఫారసు లేఖ సృష్టించిన నిర్వాకం ఆలస్యంగా వెలుగుచూసింది. మంత్రి సంతకం ఫోర్జరి ఘటన వెలుగుచూడటంతో మేల్కొన్న మంత్రి పేషీ, విద్యాశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Pages