S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/13/2019 - 23:46

కాకినాడ, సెప్టెంబర్ 13: పాడుబడిన బావిని పూడ్చిపెట్టే సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... కాకినాడ ద్వారకానగర్ రైల్వేగేటు సమీపంలో గుర్రాల లక్ష్మికాంత్, గుర్రాల రామనాథంకు చెందిన ఇంటి వద్ద సుమారు 50 ఏళ్ల క్రితం తవ్విన బావివుంది.

09/13/2019 - 22:52

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ముసురుతున్న వ్యాధులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరించాలని హైకోర్టు ఆదేశించింది. గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ వ్యాధి సోకిన రోగుల సంఖ్య ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో ఉందని కారణాలను వివరించాలని హైకోర్టు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ,రాష్ట్ర ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

09/13/2019 - 22:24

మంగళగిరి, సెప్టెంబర్ 13: 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో హ్యాపీ రిసార్ట్స్ సమీపాన శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కంటెయినర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

09/13/2019 - 22:22

విజయవాడ, సెప్టెంబర్ 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై ప్రాసిక్యూషన్‌లో ఉన్న అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

09/13/2019 - 21:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి న్యాయస్థానంలో మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్ కేసులో కోర్టులో లొంగిపోతానని ఆయన చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహర్ తోసిపుచ్చారు. పిటిషన్‌ను కొట్టివేశారు.

09/13/2019 - 21:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌ను మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ ఇప్పటికే గత తొమ్మిది రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. తొమ్మిది రోజుల కస్టడీ పూర్తి కావడంతో ఈడీ శివకుమార్‌ను ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి అజయ్‌కుమార్ కుహార్ ఎదుట ఈడీ హాజరు పరిచింది.

09/13/2019 - 21:27

షాజహాన్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్), సెప్టెంబర్ 13: అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందను స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్) ఏడు గంటల పాటు విచారించింది. అనంతరం ఇక్కడి అతని నివాసంలోని పడకగదిని మూసివేసిందని పోలీసు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

09/13/2019 - 21:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పుపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2018 మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చట్టంలోని కొన్ని అంశాలను నీరుగార్చేవిగా ఉన్నాయంటూ కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

09/13/2019 - 05:02

మంగళగిరి, సెప్టెంబర్ 12: గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసుస్టేషను వద్ద ఈనెల 11వ తేదీ విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై జే అనూరాధ పట్ల అనుచితంగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై టీడీపీ నాయకురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రాజకుమారి, మరో నేత సత్యవాణిపై పోలీసు స్టేషనులో కేసు నమోదయిం ది.

09/13/2019 - 04:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం గురువారం ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీలాండరింగ్ కేసులలో ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టులను ఆశ్రయించారు.

Pages