S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/11/2019 - 04:32

వరంగల్, సెప్టెంబర్ 10: రద్దీ ప్రాంతాల్లో తిరిగే ప్రజలనే లక్ష్యంగా చేసుకొని సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఒక బాలుడు సహా ఐదుగురు అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ల దొంగల ముఠాను మంగళవారం వరంగల్ జిల్లా హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠా సభ్యుల నుండి సుమారు 30 లక్షల విలువ గల 87 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

09/11/2019 - 01:57

జీడిమెట్ల, సెప్టెంబర్ 10: అవమానంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుందిగల్ గ్రామంలో నివాసముండే జోగు బిక్షపతికి భార్య భాగ్య (35), ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన దార శ్రావన్ కుమార్ (28) భాగ్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. బిక్షపతి తన కుటుంబాన్ని మరో ఇంట్లోకి అద్దెకు మార్చాడు.

09/11/2019 - 01:56

ఉప్పల్, సెప్టెంబర్ 10: మద్యం మత్తులో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడ పాత బస్తీలో నివసిస్తున్న ఎండీ జావీద్ (45) కూలీ. అతడు నిత్యం తాగుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం తాగిన మత్తులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.

09/11/2019 - 01:56

కాచిగూడ, సెప్టెంబర్ 10: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..

09/11/2019 - 01:55

కీసర, సెప్టెంబర్ 10: లారీ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికి చెందిన ఆనంద్ (28), హరితన్ (24), సస్మేల్ (22), అంకిరెడ్డిపల్లిలోని బాలాజీ ఫార్మా కంపెనీలో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం అంకిరెడ్డిపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ముగ్గురు కీసర వైపు వస్తున్నారు.

09/11/2019 - 01:55

ఆల్వాల్, సెప్టెంబర్ 10: మాజీ నేరస్తుడు శంకర్‌ను అరెస్ట్‌చేసి బంగారు నగలతో పాటు మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసినట్ల కార్కాన సీఐ మధుకర్ స్వామి చెప్పారు. మంగళవారం కార్కాన పోలీస్‌స్టేన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేంలో శంకర్‌తో పాటు దినకర్‌ను అరెస్టుకు సంబందించిన వివరాలు వెళ్లడించారు.

09/11/2019 - 04:57

శ్రీనగర్ : కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపూర్ ప్రాంతంలో లష్కర్-ఏ- తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎనిమిది మంది సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ముద్రించిన పోస్టర్లను తరలిస్తుండగా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిసాయి.

09/10/2019 - 23:25

రాపూరు, సెప్టెంబర్ 10 : నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి - పెనుబర్తి గ్రామాల మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రాపూరు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

09/10/2019 - 23:13

నాగాయలంక, సెప్టెంబర్ 10: స్థానిక 11వ వార్డులో సోమవారం జరిగిన ఓ సంఘటనలో ప్రమాద వశాత్తు యువకుడు నిప్పంటుకుని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ చల్లా కృష్ణ తెలియజేశారు. కొలగాని మురళీ (44) తన ఇంటి వద్ద పాత దుస్తులను తగులబెడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ మంటలు ఎగసిపడటంతో నిప్పంటుకుని ప్రమాదానికి గురయ్యాడని తెలిపారు.

09/10/2019 - 23:13

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 10: తోట్లవల్లూరు కరకట్టపై మంగళవారం రెండు కార్లు ఢీ కొన్న సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పులిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ అదుపుతప్పి విజయవాడ నుండి మోపిదేవి గుడికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న నవీన్‌రెడ్డి ష్కోడా కారును పాములలంక సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో స్విఫ్ట్ కారు నడుపుతున్న సతీష్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.

Pages