S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/10/2019 - 04:17

రాయపర్తి, సెప్టెంబర్ 9: రెండవసారి కూడా ఆడ పిల్ల పుట్టిందన్న కోపంతో పుట్టిన పసిపాపను స్వయాన తాతే పురిటిలోనే చిదిమేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కేశవపురం గ్రామ శివారలో చోటు చేసుకుంది. మండలంలోని కేశవపురం శివారు ఎర్రకుంట తండాకు చెందిన భూక్య బిచ్చకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

09/10/2019 - 04:14

విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 9: కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్న ఓ యువకుని ఆశలు అడియాసలయ్యాయి. కొలువు కోసం వచ్చిన ఆ యువకుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా విశాఖలో సోమవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పరుగు పోటీని పూర్తి చేసి సొమ్మసిల్లి పడిపోయి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఒక అభ్యర్థి మృతి చెందాడు.

09/10/2019 - 01:17

జమ్మలమడుగు, సెప్టెంబర్ 9: నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పోచం సంజయ్ లింగారెడ్డి(9), లోకేష్(8) పొలం వద్ద నీటి కోసం తవ్విన గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. పిల్లల కోసం వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు.

09/10/2019 - 00:50

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం దాఖమలు చేసిన కౌంటర్‌పై అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు తమ వాదనలను వినిపించారు. వార్డుల విభజన , జనాభా నిష్పత్తికి సంబంధించిన లోపాలను సరిచేయడం జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు.

09/10/2019 - 00:32

గుంటూరు (లీగల్) : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా లోకాయుక్తను నియమించారు. పూర్వపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ లక్ష్మణరెడ్డిని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రరాష్ట్ర లోకాయుక్తగా ఐదేళ్లపాటు లక్ష్మణరెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెలువరించనున్నారు.

09/09/2019 - 04:41

ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం రాయిగూడెం, సీతారంపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు. శనివారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో బోల్తాపడింది. కారు డోర్లు తెరుచుకోక పోవడంతో అర్రెం రాజబాబు, పాయం రవి బయటికి రాలేక, ఊపిరాడక నీటిలోనే చనిపోయారు.

09/09/2019 - 01:37

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 8: గొల్లపూడి బైపాస్ రోడ్డు ఎట్‌కిన్‌సెన్ స్కూలు సమీపంలోని గోతుల రోడ్డులో ప్రయాణిస్తున్న ఇబ్రహీంపట్నంకి చెందిన డీ మురళీమోహన్ శనివారం సాయంత్రం గోతుల వల్ల అదుపు తప్పి పడిపోయాడు. ఆ వెనుక వస్తున్న లారీ అతనిపై నుండి దూసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వీటీపీఎస్‌లో క్యాజువల్ లేబర్‌గా జీవనం సాగిస్తున్న మోహన్ ప్రాణాలు గోతులు బలిగొన్నాయని కుటుంబ సభ్యులు రోధించారు.

09/08/2019 - 22:41

కాకినాడ, సెప్టెంబర్ 7: చిన్న తరహా పరిశ్రమ స్థాపనకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికునికి అనుమతి మంజూరుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

09/07/2019 - 23:42

గుంటూరు, సెప్టెంబర్ 7: పేదలు, చిరుద్యోగుల బలహీనతలను ఆసరా చేసుకున్న ఓ వడ్డీ వ్యాపారి జలగలా వారి రక్తాన్ని పీల్చి పిప్పిచేసిన దారుణం గుంటూరు నగరంలో వెలుగు చూసింది. సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్‌లు, చెక్కులను స్వలాభానికి వాడుకుని ఇచ్చిన మొత్తానికి వందల రెట్లు వడ్డీ వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్న వడ్డీ బకాసురుడిని పోలీసులు కటకటాల వెనక్కుపంపారు.

09/07/2019 - 23:36

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 7: తపాలా శాఖలో బ్రాంచి పోస్ట్ఫాసులో పోస్టుమ్యాన్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన ఐదుగురు అభ్యర్థులు తప్పుడు స్టడీ సర్ట్ఫికెట్ దాఖలా చేసినందుకు వారిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల పోస్ట్ఫాసుల్లో పోస్టుమ్యాన్‌ల ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మందికి రాతపరీక్షలు నిర్వహించింది.

Pages