S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/06/2019 - 23:53

మంగళగిరి, సెప్టెంబర్ 6: ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారని అందిన ఫిర్యాదు మేరకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జవ్వాది శ్రీనివాసరావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

09/06/2019 - 23:09

రాయ్‌పూర్, సెప్టెంబర్ 6: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎస్టీ కులానికి చెందినట్లుగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించిన కేసులో ఈయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు జనతా కాంగ్రెస్ (జే) నాయకుడు శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కాగా, చత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జోగి..

09/06/2019 - 22:01

తిరుపతి, సెప్టెంబర్ 6: స్థానిక తిమ్మినాయుడుపాళెం అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ను చూపి సోషల్ మీడియాలో ఏసు మందిరం అంటూ దుష్ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

09/06/2019 - 21:58

వజ్రకరూరు, సెప్టెంబర్ 6: విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన చంద్ర(25), ఈరన్న(23) పొలానికి నీరందించేందుకు హంద్రీనీవా కాలువలో విద్యుత్ మోటార్ అమర్చారు. అది మరమ్మతులకు గురవడంతో శుక్రవారం వెలికి తీస్తుండగా ఇతర విద్యుత్ మోటార్ల ద్వారా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

09/06/2019 - 21:57

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగట్లపాలెం మధ్యలో ఉన్న సముద్రం వద్దకు శుక్రవారం ఇద్దరు యువకులు స్నానానికి వెళ్లి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. కుప్పిలి గ్రామానికి చెందిన బోర రమణ(20), నిమ్మ సంతు(21) మధ్యాహ్నం భోజనాలు చేశాక సముద్రం మొగ వద్దకు వెళ్లారు. అక్కడ లోతుగా ఉండడం వల్ల ఇద్దరూ గల్లంతు కావడంతో పశువుల కాపరులు గమనించి స్థానికులకు సమాచారం అందించారు.

09/06/2019 - 21:37

లక్నో, సెప్టెంబర్ 6: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ ఏజన్సీ(ఎస్‌యూడీఏ) డైరెక్టర్ ఉమేష్‌కుమార్ సింగ్‌పై హత్యకేసు నమోదైంది. ఉమేష్ భార్య అనితా సింగ్ (42) ఈనెల 1వ తేదీన బుల్లెట్ గాయాలతో మృతి చెందారు. ఐఏఎస్ అధికారి ఉమేష్ కుమార్ ఉంటున్న అధికార నివాసంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. అనితను భర్తే చంపేశాడని ఆమె సోదరుడు రాజీవ్‌కుమార్ సింగ్ ఛిన్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

09/06/2019 - 21:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఉన్నావో రేప్ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం చేకూర్చడానికి వీలుగా ప్రత్యేక న్యాయమూర్తిని నియమించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు సూచించింది. ఉన్నావో కేసు బాధితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

09/06/2019 - 21:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను త్వరలోనే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్య కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, సూర్యకాంత్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ రోజువారి విచారణను చేపడుతున్న విషయం తెలిసిందే.

09/06/2019 - 21:28

కొల్హాపూర్, సెప్టెంబర్ 6: మహారాష్టక్రు చెందిన వెటరన్ సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 2015లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వీరిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికి అరెస్టు చేసిన వారి సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో సచిన్ అండురే, అమిత్ మడ్డీ, గణేష్ మిస్కిన్‌లు ఉన్నారు.

09/06/2019 - 04:26

నంద్యాల, సెప్టెంబర్ 5: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా పాణ్యం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఏకకాలంలో నంద్యాల, కోవెలకుంట్ల, పాణ్యం మండలం కొండజూటూరు గ్రామాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

Pages