S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/04/2019 - 01:42

హైదరాబాద్, సెప్టెంబర్ 3:మహానగరంలో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి, వాటికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసే ప్రక్రియను జలమండలి అధికారులు మరింత ఉద్ధృతం చేశారు. ఆదర్శ్‌నగర్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌లోని అక్రమ నీటి కనెక్షన్‌ను తొలగించటంతో పాటు భవన యజమాని ఎం.వెంకటలక్ష్మిపై జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయించినట్లు అధికారులు తెలిపారు.

09/04/2019 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 3: శంషాబాద్‌కు చెందిన వ్యాపారి మాదిరెడ్డి రాజిరెడ్డికి సంబంధించిన షాప్ ఆడిట్ రిపోర్ట్ కోసం రూ.50వేలు డిమాండ్ చేసిన సరూర్‌నగర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారి సీహెచ్. శివ కుమార్‌ను ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంగళవారం నాంపల్లిలోని డిప్యూటీ మిషనర్ కార్యాలయంలో శివకుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

09/04/2019 - 01:37

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 3: కులాలు వేరైనా ఇద్దరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. ఆరు సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. తక్కువ కులం దానివి అని భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. మల్కాజిగిరి సీఐ మన్మోహన్ కథనం ప్రకారం.. వరంగల్ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి అలియాస్ షాబాన(26), రఫిక్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

09/03/2019 - 23:58

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వినాయక చవిత పండుగ రోజున విశాఖలో చోటుచేసుకున్న విషాద ఘటన కలచివేసింది. భవన నిర్మాణ సమయంలో పక్కనే ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి శివ, శంకరరావు అనే వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందగా, మరో వ్యక్తి ఇల్లు వర్సన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

09/04/2019 - 01:34

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం కస్టడీ ఈనెల 5వ తేదీ వరకూ కొనసాగుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తక్షణమే తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయాలని చిదంబరం తరఫు లాయర్ చేసిన వాదనను న్యాయమూర్తులు ఆర్. భానుమతి, ఏఎస్ బొపన్న సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

09/03/2019 - 23:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలో పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి చట్టాలు తీసుకు రావాల్సింది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మితిమీరిపోతున్న జనాభా వల్ల నేరాలూ తీవ్రమవుతున్నాయని, దీని దృష్ట్యా జనాభాను నిరోధించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనతోపాటు అనేక చర్యలు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

09/02/2019 - 04:57

తాడ్వాయి, సెప్టెంబర్ 1: ములుగు జిల్లా తాడ్వాయి (మేడారం) మండలంలోని కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం కారులో తరలిస్తున్న వంద కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

09/02/2019 - 04:44

నూజివీడు, సెప్టెంబర్ 1: రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్ భాగ్యలక్ష్మి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. కే 2 హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న భాగ్యలక్ష్మి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది.

09/02/2019 - 02:27

మధురవాడ, సెప్టెంబర్ 1: వార్డు, సచివాలయ పరీక్ష రాసి తన సోదరి ఇంటికి వెళ్తున్న ఆ మహిళా అభ్యర్థిని మృత్యువు కబళించింది. విశాఖపట్నంలోని మధురావడ కూడలి వద్ద ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో దివ్యమాధురి (23) మృతిచెందింది.

09/02/2019 - 02:13

సీతానగరం/శంఖవరం, సెప్టెంబర్ 1: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం రెండు వేర్వేరు దుర్ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒక దుర్ఘటనలో ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందగా, మరో ఘటనలో కాలుజారి చెరువులో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. వివరాలిలావున్నాయి...

Pages