S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/02/2019 - 02:11

తిరుపతి, సెప్టెంబర్ 1: తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒకేసారి మూడు గదుల్లో చోరీలు చేసి టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులకు, పోలీసులకు సవాల్ విసిరారు. తిరుమలలోని ఎస్‌ఎన్‌సిలోని 375-ఏ లోని గదిలో భక్తులకు చెందిన నాలుగు సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. అలాగే పక్కనే ఉన్న 373-ఏ లోకి ప్రవేశించి అక్కడున్న ఒక పట్టుచీర, రూ. 4వేలు నగదు చోరీ చేశారు.

09/01/2019 - 04:35

హైదరాబాద్, కూకట్‌పల్లి, ఆగస్టు 31: కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

09/01/2019 - 04:10

తిరుపతి, ఆగస్టు 31: కొద్దిరోజుల క్రితం ఏడుకొండలపై ఏసు మందిరాలు అని సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ కేసు కింద కేసు నమోదు చేశారు. అణువణువునా హిందుత్వం అనే గ్రూపు నుండి అరుణ్ ఈ తప్పుడు ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేశారని నిర్ధారించి సైబర్ కేసు నమోదు చేశారు.

09/01/2019 - 04:10

జి.మాడుగుల, ఆగస్టు 31: విశాఖపట్నం జిల్లా, జి.మాడుగుల మండలంలోని కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏసీబీ అధికారులు అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన ఈ తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పాఠశాలలో లోపాలను గుర్తించి, రికార్డులను సీజ్ చేశారు.

09/01/2019 - 02:32

గన్నవరం, ఆగస్టు 31: కట్టుకున్న భార్యను రోకలి బండతో తలపై మోది హతమార్చిన కసాయి భర్త వైనమిది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామ్‌నగర్‌లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరు గ్రామానికి చెందిన శామ్యూల్ అశ్వని (28) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవరుగా పనిచేస్తున్న శామ్యూల్ అశ్వనితో గత రాత్రి గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు.

09/01/2019 - 02:21

మేడ్చల్, ఆగస్టు 31: తల్లీ పిల్లలు అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ మునిసిపాలిటీ అత్వెల్లికి చెందిన కెఎం సాదిఖ్ భార్య బిన్‌షాబీ(30) ఈ నెల 27వ తేదీ సాయంత్రం తన ఇద్దరు పిల్లలు కూతురు తఫీమ్(14), కుమారుడు అవేస్(7)లను తీసుకుని ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది.

09/01/2019 - 02:21

ఖైరతాబాద్, ఆగస్టు 31: బిడ్డకు జన్మనిచ్చి తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సెంచూరి ఆసుపత్రికి గర్భవతి అయిన ఓ మహిళ గత 22న ప్రసవం కోసం సెంచూరి ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల అనంతరం 25వ తేదీన బిడ్డకు జన్ననిచ్చింది.

09/01/2019 - 02:20

కీసర, ఆగస్టు 31: చెరువులో దూకి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నాగారం మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగారం పాత గ్రామానికి చెందిన పులకుర్తి లక్ష్మమ్మ (85) శనివారం నాగారం గ్రామంలోని దాయర కుంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు అక్కడికి చేరుకొని చెరువులో నుండి మృతదేహాన్ని వెలికి తీసారు.

09/01/2019 - 02:20

షాబాద్, అగస్టు 31: కడుపు నొప్పి భరించలే క క్రిమిసంహ రక మం దు తాగి మృతి చెందిన సంఘటన అలూర్ గ్రామంలో జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం చేవెళ్ల మండల పరిధిలోని ఆలూ ర్ గ్రామానికి చెం దిన తలారి రాజు (30) గత కొన్ని రోజులు గా కడుపు నొ ప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించారు.

09/01/2019 - 00:35

న్యూఢిల్లీ : సౌర, పవన విద్యుత్ కొనగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను సమీక్షించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కడప, అనంతపురానికి చెందిన మూడు విద్యుత్ కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.

Pages