S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/30/2019 - 22:47

హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణలో మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్తున్నప్పటికీ, వేగ నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రవాణా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు అమర్చేలా రాష్ట్ర రవాణా శాఖను ఆదేశించాలని కోరుతూ ది రైట్ సొసైటీ సంస్థ హైకోర్టులో ప్రజావాజ్య పిటిషన్ (పిల్)ను దాఖలు చేసింది.

08/30/2019 - 22:36

అమలాపురం, ఆగస్టు 30: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు ఒకరు భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రి పైభాగంలో నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం శుక్రవారం ఉదయం ప్రాణాంతక మత్తుమందు కలిపిన సెలైన్ ఎక్కించుకోవడంతో మృతిచెందారు. విగతజీవులై పడివున్న వీరిని ఆసుపత్రి సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.

08/30/2019 - 22:29

గుంతకల్లు, ఆగస్టు 30: రైలు ప్రయాణికులకు మత్తుమందు ప్రయోగం చేసి, వారి వద్ద ఉన్న బంగారు నగలు దోచుకున్న సంఘటన శుక్రవారం గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన ఎలిసే, మరియ 16345 నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబాయి నుండి కొట్టాయంకు గురువారం బయలుదేరారు.

08/30/2019 - 22:28

తిరుపతి, ఆగస్టు 30: టీటీడీ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసే పార్థసారధి శుక్రవారం తాను నివాసం ఉంటున్న టీటీడీ గోవర్థన సత్రంలో తన ఇంటిలో రూమ్ నెంబర్ 26లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

08/30/2019 - 22:28

ఉరవకొండ, ఆగస్టు 30: మఠం భూమి లీజు పొడిగింపు కోసం లీజుదారుడి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకున్న ముగ్గురు దేవదాయశాఖ ఉద్యోగులను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కరిబసప్ప స్వామి గవిమఠంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శంకర్, జూనియర్ అసిస్టెంట్లు నారాయణస్వామి, గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/30/2019 - 22:14

న్యూఢిల్లీ,ఆగస్టు 30: నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.190 కోట్ల రుణం తీసుకున్న అంశంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటిపై సీబీఐ ఫోర్జరీ, మోసం తదితర కేసులను నమోదు చేసింది.

08/30/2019 - 22:12

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రీకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కొలీజయం శుక్రవారం సిపార్సు చేసింది. జస్టిస్ మహేశ్వరి మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా గతంలో ఆయన సేవలు అందించారు.

08/30/2019 - 22:11

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఐఎన్‌ఎక్స్ మీడియా స్కాం కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరో మూడు రోజులు సీబీఐ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశించింది. శుక్రవారం కోర్టు ఆదేశాలతో చిదంబరం సెప్టెంబర్ 2 వరకూ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐఎన్‌ఎక్స్ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని, కాంగ్రెస్ సీనియర్ నేతను ప్రశ్నించాలని సీబీఐ స్పష్టం చేసింది.

08/30/2019 - 04:22

పనాజి, ఆగస్టు 29: గోవా జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) తన బాధ్యతలను విస్మరిస్తున్నారని, ఖైదీల పెరోల్, ఫర్‌లాఫ్ దరఖాస్తుల విషయంలో మనసు పెట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని బొంబాయి హైకోర్టు మండిపడింది.

08/30/2019 - 04:06

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మనీలాండరింగ్ అన్నది తీవ్రమైన నేరమని, సమాజానికి, జాతికి చేటుతెస్తుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పీ. చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఎఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనాన్ని ఈడీ కోరింది.

Pages