S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/30/2019 - 02:33

చీరాల, ఆగస్టు 29: తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆగస్టు 15న మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్‌ను బెదిరించారన్న ఆరోపణపై బలరామ్‌పై కేసు నమోదైంది.

08/30/2019 - 02:12

గుడ్లవల్లేరు, ఆగస్టు 29: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి కనగాల రవీంద్రబాబుతో మృతురాలు ధనలక్ష్మికి గత ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం కలిగారు. గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో పెద్దలు పంచాయతీ పెట్టారు.

08/29/2019 - 23:28

జడ్చర్ల, ఆగస్టు29: ఫేస్‌బుక్ పరిచయం ఓ అభం శుభం తెలియని బాలిక ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన యువకుడు అమ్మాయి పాలిట యముడిగా మారి ప్రాణాలు తీశాడు. సంచలనాత్మకంగా మారిన ఈ ఘటన యావత్తు ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది.

08/29/2019 - 23:18

సూర్యాపేట, ఆగస్టు 29: గతంలో ఆడశిశువుల విక్రయాలు, గిరిజన యువతుల అమ్మకాలకు కేంద్రంగా పేరుగాంచిన సూర్యాపేటలో తాజాగా అద్దె గర్భాల ముఠా ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మూడు నెలల క్రితం అదృశ్యమైన మహిళను ఈ ముఠా మాయమాటలు చెప్పి సరోగసి కోసం చెన్నైకి పంపించిన విషయం సదరు మహిళ భర్త ఫిర్యాదుతో బట్టబయలైంది.

08/30/2019 - 05:11

కోయంబత్తూరు: లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం మేరకు ఇటీవలే తమిళనాడులో అలర్ట్ ప్రకటించారు.

08/29/2019 - 22:46

న్యూఢిల్లీ, ఆగస్టు 29: కృష్ణా ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణానదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫు సాక్షి, ఇంజినీరింగ్ నిపుణుడు ఘనశ్యాం ఝాను ఏపీ తరఫు న్యాయవాది వెంకట రమణి గురువారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

08/29/2019 - 04:26

కలువాయి, ఆగస్టు 28 : నెల్లూరు జిల్లా కలువాయి తహశీల్దారు కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ దేవానంద్ సన్స్ బుధవారం దాడి చేశారు. మండలంలో తుళ్లూరు గ్రామానికి చెందిన ముకుంద అనే వ్యక్తి తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాలు ఇప్పించాలని గత కొంత కాలంగా తుళ్లూరు విఆర్‌వో పోలయ్యను అడుగుతున్నాడు. అయితే పాసు పుస్తకం ఇవ్వాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని వీ ఆర్వో డిమాండ్ చేశాడు.

08/29/2019 - 04:01

విజయవాడ (క్రైం), ఆగస్టు 28: రాష్ట్ర ముఖ్యమంత్రి, జలవనరుల శాఖామంత్రిని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సోమశేఖర్‌తో పాటు మరో నలుగురిని విజయవాడ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

08/29/2019 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 28: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా పడింది. పిటిషనర్లు దాఖలు చేసిన కౌంటర్లపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. పిటిషనర్ల కౌంటర్లపై సమాధానం చెప్పేందుకు కొంత గడువు కావాలని ప్రభుత్వం తరఫున కౌన్సిల్స్ కోరడంతో హైకోర్టు సెప్టెంబర్ 9 వరకూ గడువు ఇచ్చింది.

08/29/2019 - 02:20

న్యూఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్‌లో వరుసగా రెండో రోజు బుధవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాలకు విభజన చేసేందుకు ఏర్పాటు చేయబడిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ గురువారం కూడా కొనసాగనుంది.

Pages