S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/29/2019 - 01:55

న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసిన తర్వాత జమ్మూ-కాశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు విధించడంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని, జమ్మూ-కాశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది.

08/29/2019 - 01:32

పెనమలూరు, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంకిపాడు గ్రామానికి చెందిన టీ ఉమామహేశ్వరరావు(48) అశోక్‌నగర్‌లోని టైమ్ ఆసుపత్రిలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. రోజూ కంకిపాడు నుండి ఆసుపత్రికి బైక్‌పై వస్తుంటాడు.

08/29/2019 - 01:32

తోట్లవల్లూరు, ఆగస్టు 28: మండలంలోని వల్లూరుపాలెం గ్రామం లాకుల వద్ద బుధవారం పోలిశెట్టి గణేష్‌కుమార్(38) మృతదేహాం లభ్యమైందని ఎస్‌ఐ చిట్టిబాబు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ మండలం బిళ్ళపాడు గ్రామానికి చెందిన గణేష్‌కుమార్ విజయవాడ ఆటోనగర్ వెల్డింగ్ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నాడు.

08/29/2019 - 01:25

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 28: నగర పరిధిలోని భవానీపురానికి చెందిన బాలికకు అబార్షన్ చేసిన ఘటనపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీవ్రంగా స్పందించింది. భవానీపురం పోలీసుల వద్దకు వచ్చిన బాలికను సీడబ్ల్యూసీ ముందు హాజరుపర్చగా, నగరంలోని బాలికల ఓపెన్ షెల్టర్‌లో ఆశ్రయమిచ్చారు. హోమ్‌లోని సిబ్బంది కౌనె్సలింగ్ చేసే సమయంలో బాలిక చెప్పిన విషయాలు దిగ్భ్రాంతి కలిగించాయి.

08/29/2019 - 01:03

వేములవాడ టౌన్: డ్రైవర్ మద్యం మత్తు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలితీ సుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

08/29/2019 - 04:13

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-370ని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణను అక్టోబర్ మొదటి వారంలో చేపడతామని బుధవారం తెలిపింది.

08/29/2019 - 00:32

హైదరాబాద్ : తమిళనాడు విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్, ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎస్ మురుగన్ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఎస్పీ స్థాయి మహిళా ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు బాధ్యతను తమిళనాడు హైకోర్టు తెలంగాణ పోలీసులకు అప్పగించింది. కేసు దర్యాప్తు బాధ్యతను ఒక మహిళా ఐపీఎస్‌కు అప్పగించాలని కూడా కోర్టు సూచించింది.

08/28/2019 - 23:42

న్యూఢిల్లీ, ఆగస్టు 28: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ పోలీసుల కస్టడీలో ఉన్న సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ యూసుఫ్ తరిగామిని కలుసుకునేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ పర్యటనలో ఎక్కడా రాజకీయాల ప్రస్తావన తీసుకురావద్దని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

08/28/2019 - 23:39

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనను గురువారం వరకు అరెస్టు చేయడానికి వీల్లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు భానుమతి, కేఎస్ బొపన్నతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ కేసుపై వాదనలను విన్నది.

08/28/2019 - 04:56

జగిత్యాల, ఆగస్టు 27: అవినీతి నిరోధకశాఖ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. వారం రోజుల క్రితమే మత్స్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులు పట్టుబడగా వారం గడవకముందే మరో ఉద్యోగి పట్టుబడడం జిల్లాలో అవినీతి పెచ్చుమీరిందనడానికి ఉదహరణగా నిలుస్తుంది.

Pages