S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/27/2019 - 04:52

గుంటూరు, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ నుండి అక్రమంగా తరలించిన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలోని చుట్టుగుంట వద్దనున్న కోడెల కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో అసెంబ్లీ అధికారులు గత మూడు రోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు.

08/27/2019 - 04:40

గరివిడి, ఆగస్టు 26: ఆటపాటలతో,ఆనందంగా కేరింతల్లో తేలిన ఇద్దరు చిన్నారులు తోటపల్లి కాలువలో పడి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. చీపురుపల్లి మండలంలోని అగ్రహారం ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇజ్జిరోతు సతీష్(9) కదిరి గౌరీశంకర్ (9)అనే ఇద్దరి చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/27/2019 - 04:38

గుంటూరు, ఆగస్టు 26: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై గుంటూరు జిల్లా నర్సరావుపేట రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కోడెల కుమార్తె విజయలక్ష్మి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో సేఫ్ ఫార్మాస్యూటికల్స్ పేరిట ఓ సంస్థను ఏర్పాటుచేసి అక్కడ సెలైన్ బాటిల్స్‌తో పాటు వివిధ ఔషధాలు తయారు చేస్తుంటారు.

08/27/2019 - 04:24

నిజామాబాద్, ఆగస్టు 26: అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మద్యం మత్తులో ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. జిల్లా కేంద్రంలోని దొడ్డికొమురయ్యనగర్‌లో నివాసం ఉండే చిన్నారిని, అదే కాలనీకి చెందిన ప్రకాష్ (37) అనే వ్యక్తి తాగిన మైకంలో మాయమాటలు చెప్పి తన వెంట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

08/27/2019 - 04:17

హైదరాబాద్, ఆగస్టు 26: వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయివాల్మీకిల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయి హక్కుల సమితి పిటిషన్ దాఖలుచ ఏసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

08/27/2019 - 02:55

హైదరాబాద్, ఆగస్టు 26: ఓబుళాపురం గనుల కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ డీల్ కేసులో ఏసీబీ కోర్టుకు మాజీ సీబీఐ న్యాయమూర్తి నాగమారుతీ శర్మ , గాలిజనార్ధనరెడ్డి సోమవారం హాజరయ్యారు. బెయిల్ డీల్ కేసులో న్యాయాధికారి నాగమారుతీ శర్మ నాలుగో సాక్షిగా ఉన్నారు. ఇరువరి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు.

08/27/2019 - 02:47

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దరఖాస్తులను వ్యక్తిగతంగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఆర్‌టీఐ కార్యకర్తలు సమాచారం పొందే విధంగా ఆన్‌లైన్ పోర్టల్స్‌ను ప్రారంభించాలంటూ దాఖలైన అభ్యర్థనను పురస్కరించుకుని సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి, 25 రాష్ట్రాలకు నోటీసులు పంపించింది.

08/27/2019 - 02:40

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి సోమవారం సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రద్దుచేసి ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది.

08/27/2019 - 01:40

విజయవాడ (క్రైం), ఆగస్టు 26: విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. లంచాలే పరమావధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది.

08/27/2019 - 01:19

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26: వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ గురవారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామ సమీపంలోని చెరువు కట్టకింద గుర్తు తెలియని వివాహిత మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Pages