S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/27/2019 - 01:19

గచ్చిబౌలి, ఆగస్టు 26: ఫేస్‌బుక్ ప్రేమాయణాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎన్ని రకాలుగా చెబుతున్న యువతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ పుస్తక పరిచయాలను ప్రేమగా ఊహించుకుని యువతులు మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు విసిరే వలలో పడి చెప్పే మాయమాటలకు మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

08/27/2019 - 00:25

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరాన్ని మరో నాలుగు రోజుల పాటు కస్టడీలోనే ఉంచి విచారించాలని ఢిల్లీ కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 30 వరకు ఆయన్ను కస్టడీలోనే ఉంచాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు.

08/26/2019 - 04:34

విజయవాడ, ఆగస్టు 25: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతువేషం వేయటంతో పాటు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. జగన్ ప్రభుత్వంపై బురద జల్లే పెయిడ్ పబ్లిసిటీలో ఇతను కీలకంగా ఉన్నాడు.

08/26/2019 - 03:53

కర్నూలు, ఆగస్టు 25: కరుడుగట్టిన ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరుగడించిన కర్నూలు జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్‌ను మరిపించే హత్య జరిగింది. సుమారు నాలుగేళ్ల క్రితం ఓ అనాథను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అతడి సోదరుడి పేరుతో రూ. 33 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

08/26/2019 - 02:43

శంషాబాద్, ఆగస్టు 25: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం ఆదివారం పట్టుబడింది. ఇంటెలిజెన్స్ అధికారుల ముందస్తు సమాచారంతో షార్జా నుంచి ఇండిగో 6ఈ 1406 నంబర్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 26 బంగారు కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

08/26/2019 - 02:36

ప్రతాప్‌ఘర్/సంభాల్, ఆగస్టు 25: ఉత్తర్ ప్రదేశ్‌లో ఈతకు వెళ్ళిన ఏడుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఆదివారం రెండు వేర్వేరు చెరువుల్లో ఏడుగురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని కోదౌర్ ప్రాంతంలోని ఓ చెరువులో ఈత కొట్టేందుకు సూర్యగ్రహ గ్రామానికి చెందిన నలుగురు యుక్త వయస్సుగల వారు వెళ్ళారు.

08/26/2019 - 01:11

జీడిమెట్ల, ఆగస్టు 25: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్, దీప్తిశ్రీనగర్‌లో నివాసముండే పీ.వెంకటేశ్వర రావు కుమారుడు పీ.సాయి శివకాంత్ (35) వ్యాపారి. ఎన్‌ఎస్‌యూఐ నాయకునిగా కొనసాగుతున్నాడు.

08/26/2019 - 01:02

వికారాబాద్, ఆగస్టు 25: అదుపుతప్పి ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ సంఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ లారీ వికారాబాద్-హైదరాబాద్ రైల్వే బ్రిడ్జీపై అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్, కినె్నరుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

08/26/2019 - 00:45

గుంటూరు: మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైంది. అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్‌ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్‌కు తరలించారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కోడెలపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అసెంబ్లీ అధికారులు కోడెల క్యాంప్ కార్యాలయం, గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుర్తించారు.

08/25/2019 - 23:17

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తనకు ముందస్తు బెయి ల్ నిరాకరించడంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనుంది. అలాగే, తనపై జారీ అయిన అరెస్టు వారెంట్‌ను కూడా సవాల్ చేస్తూ చిదంబరం తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా జస్టిస్ ఆర్. భానుమతి సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Pages